ప్రేమిస్తే పెంగ్విన్‌లా ప్రేమించాలి.. మగ పెంగ్విన్ ప్రేమ ఎంత గొప్పదో తెలుసా?

Samatha

28 January 2026

ఈ మధ్య ఇన్ స్టా ఓపెన్ చేస్తే చాలు పెంగ్విన్ వీడియోనే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి.

ఇన్ స్టా

ఓ పెంగ్విన్ తన మందను అనుసరించకుండా ఒంటరిగా నడుస్తూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఇది  ఎన్ కౌంటర్ ఎట్ ది, ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీలోది. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.

వైరల్ వీడియో

ఈ క్రమంలోనే మగ పెంగ్విన్స్ ప్రేమ గొప్పతనం చెబుతూ అనేక వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా వాటి ప్రేమ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మగ పెంగ్విన్ ప్రేమ

అంటార్కిటికా చల్లని ప్రపంచంలో పెంగ్విన్స్ ప్రేమ జీవితం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇవి తమ ప్రేమను వ్యక్త పరచడానికి గులకరాయిని ఇస్తాయట.

పెంగ్విన్ ప్రేమ జీవితం

ముఖ్యంగా మగ పెంగ్విన్స్ ప్రేమ చాలా గొప్పది, ఇవి తమ జీవిత భాగస్వామి పట్ల చూపే నిబద్ధత, తమ పిల్లలను పెంచే తీర, ప్రతి ఒక్కటీ అందరినీ ఆకర్షిస్తాయి.

మగ పెంగ్విన్ ప్రేమ గొప్పది

అయితే పెంగ్విన్స్ తమకు నచ్చిన ఆడ పెంగ్విన్ మనసు దోచుకోవడానికి, తన ప్రేమను వ్యక్త పరచడానికి ఒక అందమైన రాయిని తీసుకొచ్చి ఇ్తుందంట. ఆడ పెంగ్విన్ ఆ రాయిని తీసుకుంటే, అది తన ప్రేమను అంగీకరించినట్లే.

ఆడ పెంగ్విన్ మనసు దోచుకోవడం

అప్పుడు అవి ఒకే రకమైన రాళ్లతో గూడు నిర్మించుకుంటాయి.  అవి జీవితాంతం జతకడతాయి, ఆహారం కోసం కొన్ని వేళ్ల మైలు వెళ్లినప్పటికీ, సంతానోత్పత్తి కాలంలో తన పాత సహచరులను కలుస్తాయంట.

జతకలవడం

దాని కోసం ఆడ పెంగ్విన్స్ పాత ప్రదేశంలోకి వస్తాయి, అప్పుడు మగ పెంగ్విన్స్ ప్రత్యేకమైన కాల్ చేస్తుందంట. దానిని బట్టి అవి తమ భాగస్వాములను గుర్తించి, ఏకం అవుతాయంట.

కాల్

ఇక ఆడ పెంగ్విన్ గుడ్లు పెట్టి సముద్రంలోకి ఆహారం కోసం వెళితే, మగ పెంగ్విన్ మాత్రం తన పాదాలపై గుడ్లను పట్టుకొని, చలి తగలకుండా కొన్ని నెలల పాటు ఆహారం లేకుండా తమ పిల్లల కోసం వేచి చూస్తుందంట.

పిల్లలకు రక్షణగా మగ పెంగ్విన్

అలాగే తన భాగస్వామికి చాలా సహాయకారికగా ఉంటుందంట. తమ ప్రేమను చూపెట్టడానికి ఒకరి ముక్కలతో ఒకరు రెక్కలు శుభ్రం చేసుకుంటూ ఎలాంటి నిస్వార్థం లేకుండా ఆనందంగా కలిసి ఉంటాయంట,

ఆనందకరమైన జీవితం