మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. బుధవారం ఉదయం ముంబై నుంచి బారామతికి వెళ్తుండగా, 8:45 గంటలకు ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్ అయ్యింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన బారామతికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో ఐదుగురు దుర్మరణం చెందారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.