Watch Video: అఖిలప్రియ బాడీగార్డ్‎పై దాడి.. భద్రత పెంచిన పోలీసులు..

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ విజృంభించింది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీ గర్డ్‎పై హత్యాయత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పలు చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి.

Watch Video: అఖిలప్రియ బాడీగార్డ్‎పై దాడి.. భద్రత పెంచిన పోలీసులు..
Bhuma Ahila Priya Bodyguard
Follow us

|

Updated on: May 15, 2024 | 2:35 PM

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ విజృంభించింది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీ గర్డ్‎పై హత్యాయత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పలు చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ పూర్తైనప్పటికీ పగలు చల్లారలేదు. ఏవీ సుబ్బారెడ్డి అనుచరులు భూమ అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్‎పై దాడికి పాల్పడినట్లు కొందరు భావిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన దృశ్యాల్లో చాల క్లియర్ గా ఒక వాహనం వేగంగా వచ్చి నిఖిల్ పైకి దూసుకెళ్లినట్లు కనిపిస్తోంది. అయితే ఈ వాహనం ఎవరిది, అందులో వచ్చిన వ్యక్తులు ఎవరికి సంబంధించిన వారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉంటే గతంలో నంద్యాలలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ దాడికి పాల్పడ్డాడు. దీనిని మనసులో పెట్టుకునే ప్రస్తుతం ఈదాడికి పాల్పడినట్లు అఖిలప్రియ వర్గీయులు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై ఏవీ సుబ్బారెడ్డి ఇంకా స్పందించలేదు. గాయపడిన బాడీగార్డును నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసు శాఖ అటు అఖిల ప్రియ, ఇటు ఏవీ సుబ్బారెడ్డి ఇళ్ల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్