Andhra Schools: ఏపీ విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది

పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ విధానాన్ని తీసుకురానున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ విధానంలో భాగంగా ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో కొంతమందిని ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్‌గా ఎంపిక చేయనున్నారు.

Andhra Schools: ఏపీ విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది
Anshra Students
Follow us

|

Updated on: May 15, 2024 | 2:41 PM

ఆంధ్రాలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి గవర్నమెంట్ హై స్కూల్స్‌లో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రకటన జారీ చేశారు. టెక్నాలజీని అందింపుచ్చుకని మెరుగైన అవకాశాలు పొందేందుకు.. ఆధునిక పోకడలను అవపోసన పట్టేందుకు వీలుగా ఈ విధానం తెస్తున్నట్లు వెల్లడించారు. ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రాలో ఉన్న 7,094 గవర్నమెంట్ హై స్కూల్స్‌లో జూన్ 12వ తేదీ నాటికి 2,379 మంది ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్స్‌ను ఎంపిక చేసి డ్యూటీలు వేయనున్నట్లు చెప్పారు.

ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ విధానంలో భాగంగా ఇంజినీరింగ్ 4వ సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్‌లో కొంతమందిని ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్‌గా సెలక్ట్ చేస్తారు. అలా ఎంపిక చేసిన వీరితో గవర్నమెంట్ హై స్కూల్స్‌లో విద్యార్థులకు డిజిటల్ టీచింగ్, లెర్నింగ్ గురించి అవగాహణ కల్పిస్తారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక విషయమై సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్‌తో మాట్లాడాలని ఇప్పటికే RJDలు, DEOలకు ఆంధ్రా పాఠశాల విద్యాశాఖ సూచించింది.

కాగా ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్ విధుల నిర్వహణపై కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల మధ్య మ్యాపింగ్ పూర్తయ్యిందన్న ప్రవీణ్ ప్రకాష్.. ఈ సంవత్సరం నుంచే ప్రతి మూడు స్కూళ్లకు ఒక ఎక్స్‌పర్ట్‌ను నియమించనున్నట్లు తెలిపారు. మరోవైపు ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్‌కు 3 సంవత్సరాల ఇంజినీరింగ్ కోర్సుకు సంబంధించిన ఫ్యూచర్ స్కిల్ టెక్ట్ బుక్‌ను ఈ- బుక్ ఫార్మాట్లో అందజేయాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్.. అధికారులకు సూచించారు. జూన్ 10న ఫ్యూచర్ స్కిల్ ఎక్స్‌పర్ట్స్ ఎంపిక కోసం ఆన్ లైన్ టెస్ట్ పెట్టబోతున్నట్లు వివరించారు. జూన్ 12వ తేదీ నాటికి 26 జిల్లాల్లోని ప్రతి మూడు గవర్నమెంట్ హై స్కూల్స్‌లో ఒక ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ పర్ట్‌ను నియమిస్తామని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్