AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నివురుగప్పిన నిప్పులా పరిస్థితి.. ఏపీలో హైటెన్షన్.. ఈ ప్రాంతాల్లో 144సెక్షన్‌..

పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144సెక్షన్‌ విధించారు పోలీసులు. టీడీపీ-వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకటరామిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

Andhra Pradesh: నివురుగప్పిన నిప్పులా పరిస్థితి.. ఏపీలో హైటెన్షన్.. ఈ ప్రాంతాల్లో 144సెక్షన్‌..
Ap Elections 2024
Shaik Madar Saheb
|

Updated on: May 15, 2024 | 1:51 PM

Share

పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144సెక్షన్‌ విధించారు పోలీసులు. టీడీపీ-వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకటరామిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పట్టణంలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి.. ప్రతీ ఒక్కర్ని తనిఖీ చేశాకే వదులుతున్నారు. మరోవైపు నరసరావుపేటలో ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. అంతేకాదు.. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును గృహనిర్బంధంలో ఉంచారు పోలీసులు. ఎన్నికలు జరిగిన రోజు నుంచే అల్లర్లు చెలరేగాయి. దీంతో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు. నిన్న రాత్రి మాచవరం మండలంలో YCP కార్యకర్తలపై ప్రత్యర్థి వర్గం దాడికి దిగింది. రెండు పార్టీల మధ్య వార్‌ నడుస్తోంది. నిన్న తంగెడలో బాధితులను పరామర్శించారు టీడీపీ నేత యరపతినేని. అదే సమయంలో కొత్త గణేషునిపాడులో బాధితులను పరామర్శించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆ సమయంలో అటు పోలీసులకు ఇటు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. నేతల పర్యటనలతో మరింతగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతుండటంతో ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. పలుచోట్ల కేంద్ర బలగాల మోహరించారు.

మరోవైపు గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో దాడులు కొనసాగుతున్నాయి. మదీనపాడులో వైసీపీ నేతపై టిడిపి వర్గీయులు దాడి చేశారు. కర్రలతో వైసిపి నేత దొండేటి ఆదిరెడ్డిపై దాడి చేసింది ప్రత్యర్థి వర్గం. ఈ దాడిలో ఆదిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి నివురుగప్పిన నిప్పులా ఉంది. పోలింగ్‌నాడు అక్కడ గొడవలు జరిగిప్పటి నుంచి హైటెన్షన్‌ వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మరిన్ని ఘర్షణలు నివారించే పనిలో ఉన్నారు పోలీసులు. తెల్లవారుజామున 3 గంటలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి తలుపులను బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు. ఆయన ఇంట్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు బయటకు పంపారు. ఇప్పుడు తాడిపత్రిలో 144 సెక్షన్ అమలవుతోంది. బహిరంగ ప్రదేశంలో ఇద్దరు కన్నా ఎక్కువమంది ఉంటే అరెస్టు చేస్తామంటూ హెచ్చరించారు పోలీసులు.. మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి మరో ప్రాంతానికి తరలించారు పోలీసులు. ఇద్దరు నేతల ఇళ్లకు వెళ్లే ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. అక్కడికి ఇతర ప్రాంతాల వారు రాకుండా ఆంక్షలు విధించారు. తాడిపత్రిలో కేంద్ర బలగాలతో పాటు జిల్లా పోలీసులు కూడా మోహరించారు.

చంద్రగిరి, తిరుపతిలోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పోలింగ్ నేపథ్యంలో జరిగిన ఘర్షణలతో చంద్రగిరి, తిరుపతిలో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి, తిరుపతిలో పికెటింగ్‌లు కొనసాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల పరస్పర ఫిర్యాదులతో నాలుగు కేసులు నమోదయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..