Visakhapatnam: తెల్ల పులికి జన్మదిన వేడుకలు.. 5 కేజీల కేక్‌తో ఘనంగా నిర్వహించిన జూ అధికారులు..
Visakhapatnam: మీరెన్నో జన్మదిన వేడుకలు చూసి ఉంటారు. కానీ పులి జన్మదిన వేడుకల్ని మీరు ఎప్పుడైనా చూశారా..? పోనీ విన్నారా..? జాతీయ జంతువుగా చెప్పుకునే పులి దగ్గరకు వెళ్లాలంటేనే ప్రాణభయం. అలాంటి పులికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు విశాఖ జూ అధికారులు. అవును, ఈ వార్త మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే వార్త. విశాఖ జూలో ఐదేళ్ల పులికి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు అక్కడి అధికారులు. విశాఖలోని ఇందిరా గాంధీ ప్రదర్శనశాల
విశాఖపట్నం, ఆగస్టు 13: కలవారి ఇంట పుట్టిన పిల్లలు, పెద్దల పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం చూశాం. అర్ధాయిష్షు పూర్తి చేసుకునే వాళ్లు, షష్ఠీ పూర్తి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం కూడా చూస్తుంటాం. అదే సమయంలో చనిపోయిన ప్రముఖుల బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇక ఇటీవల కాలంలో పెంపుడు కుక్కల -Pet dogs జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన సందర్భాలూ చూస్తున్నాం. కానీ పులి జన్మదిన వేడుకల్ని మీరు ఎప్పుడైనా చూశారా..? పోనీ విన్నారా..? జాతీయ జంతువుగా చెప్పుకునే పులి దగ్గరకు వెళ్లాలంటేనే ప్రాణభయం. అలాంటి పులికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు విశాఖ జూ అధికారులు.
అవును, ఈ వార్త మనందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే వార్త. విశాఖ జూలో ఐదేళ్ల పులికి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు అక్కడి అధికారులు. విశాఖలోని ఇందిరా గాంధీ ప్రదర్శనశాలలో ‘పీచెస్’ అనే తెల్లపులి ఆగస్ట్ 13వ తేదికి ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో ఏట అడుగు పెట్టింది. దీంతో జన్మదిన వేడుకలు నిర్వహించాలని అనుకున్నారు జూ అధికారులు. వీళ్లకు కళాశాల విద్యార్థులు తోడయ్యారు. అంతే వేడుకలు ఉత్సాహంగా, ఆనందంగా జరిగాయి.
ఎంక్లోజర్ వద్ద కేక్ కటింగ్
ఆ ఐదేళ్ల తెల్లపులి “పీచెస్” ఉండే ఎన్ క్లోజర్ దగ్గర జరిగిన ఈ వేడుకలకు ప్రత్యేకంగా వైట్ టైగర్ థీమ్ కేక్‌ను తయారు చేయించారు. క్యూరేటర్ డాక్టర్ నందని సలారియా స్వయంగా కేక్ కట్ చేశారు. వేడుకలకు ప్రత్యేక అతిధులుగా హాజరైన విద్యార్థులందరూ తమ ముఖానికి వైట్ టైగర్ మాస్క్‌లు ధరించి పీచెస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పులిని దత్తత తీసుకున్న కళాశాల
వైట్ టైగర్ పీచెస్‌ను మరింత జాగ్రత్తగా చూసుకునేందుకు, దాని సంక్షేమానికి దోహదపడేందుకు CPE జూనియర్ కాలేజ్ ముందుకొచ్చింది. సవ్యప్రాణుల సంరక్షణ పట్ల వారి అంకిత భావానికి నిదర్శనంగా కళాశాల యాజమాన్యం ఒక నెల పాటు పీచెస్ ను దత్తత తీసుకుంది. పీచెస్ యొక్క 5వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని, CPE జూనియర్ కళాశాల వారు పీచెస్‌ను దత్తత తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు క్యూరేటర్ డాక్టర్ నందనీ సలారియా.
జూలో అత్యంత చిన్న వయసున్న పులి
జూలో ఉన్న పులులలో అత్యంత చిన్న వయసు కల ఇదే పులి కావడం, జూ సిబ్బంది కళ్ళ ముందు పుట్టి వాళ్ళతో కలిసి మెలిసి ఎదుగుతున్న పీచేస్ అంటే జూలో అందరికి ఇష్టమే. ఆ కారణంతోనే దాని వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. అంతరించిపోతున్న జాతులను, వాటి సహజ ఆవాసాలను రక్షించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని క్యూరేటర్ నందని టీవీ9తో అన్నారు. పీచెస్ తవ 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది, వైజాగ్ జూ వన్యప్రాణుల సంరక్షణ స్ఫూర్తికి సహకరించడానికి కట్టుబడి ఉందని క్యూరేటర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.