Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అతివేగంతో ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయిన యువకుడు.. వైరల్ అవుతున్న సజ్జనార్ ట్వీట్ వీడియో..

RTC MD Sajjanar: ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ ఎన్ని సూచనలు, నిబంధనలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఇక అతివేగం కారణంగా ఎంతటి ప్రమాదం జరుగుతుందో స్పష్టంగా అర్థమయ్యేలా ప్రముఖ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఓ వీడియోను షేర్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా సజ్జనార్ రోడ్డు ప్రమాదాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు వ్యక్తిగతంగా..

Viral Video: అతివేగంతో ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయిన యువకుడు.. వైరల్ అవుతున్న సజ్జనార్ ట్వీట్ వీడియో..
Accident Video Visuals, Tweet By Sajjanar
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 12, 2023 | 6:20 PM

తెలంగాణ, ఆగస్టు 12: అతివేగం అనర్థాలకు కారణమని ఎందరు, ఎన్ని సార్లు చెప్పినా నేటి యువతకు ప్రమాదాలు జరిగే వరకూ చెవికి ఎక్కట్లేదు. చేతికి బైక్ రావడమే ఆలస్యం.. కంటికి కనిపించనంత వేగంతో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో వేస్తారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ ఎన్ని సూచనలు, నిబంధనలు చేసినా ఫలితం లేకుండా పోతుంది. ఇక అతివేగం కారణంగా ఎంతటి ప్రమాదం జరుగుతుందో స్పష్టంగా అర్థమయ్యేలా ప్రముఖ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఓ వీడియోను షేర్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా సజ్జనార్ రోడ్డు ప్రమాదాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా అధికారులకు ఆదేశాలను జారీ చేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ‘అతివేగం… అనర్థం!’ అంటూ ఓ వీడియోను షేర్  చేశారు. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

సజ్జనార్ షేర్ చేసిన ఆ వీడియో ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించినది. అందులో ఫ్లైఓవర్‌పై నుంచి ఓ యువకుడు అతి వేగంతో బైక్ నడుపుతూ.. బారికేడ్‌కి ఢీకొంటాడు. అంతే.. అతను వచ్చిన వేగానికి అతను ఫ్లైఓవర్ బారికేడ్‌ మీద నుంచి కింద పడ్డాడు. బైక్ మాత్రం దాని మానాన అది రోడ్డుపై పోయింది. కానీ అతను మాత్రం ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఈ ప్రమాదం తర్వాత అతని పరిస్థితి ఏమిటనేది వీడియోలో లేదు, ఇంకా వివరాలు తెలియరాలేదు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ సజ్జనార్ ‘తొందరగా వెళ్లాలనే ఆత్రంలో మితిమీరిన వేగంతో రహదారులపై వాహనాలతో వెళ్ళకండి. వేగం అదుపులో లేకుంటే ఇలా అదుపుతప్పి ప్రమాదాలకు గురై.. ప్రాణాలు కోల్పోతారు.. జాగ్రత్త’ అని కూడా ప్రజలకు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియోపై అటు తెలంగాణ యువత, నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. ‘ఎన్ని చెప్పినా చెవికెక్కవు సర్ కొందరికి. అనర్థం జరిగాక ఆలోచిశ్తారు. అప్పుడు ఏం ప్రయోజనం’ అంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడగా.. ‘టర్నింగ్స్‌ల్లో స్పీడ్ తగ్గించాలని తెలియదు వీళ్లకు’ అని మరొకరు రాసుకొచ్చారు.

వీడియోపై నెటిజన్ స్పందన

ఇంకా సజ్జనార్ లాంటి ఉన్నత స్థాయి అధికారి.. యువతను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఇలా చేయడం సంతోషకరమని మరో నెటిజన్ ఆయన్ను ప్రశంసించాడు.

కాగా, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సజ్జనార్ ఈ నెలలోనే అనేక వీడియోలను పోస్ట్ చేశారు. వాటిపై ఓ లుక్ వేయండి..

ఆగస్టు 6న సజ్జనార్ చేసిన రోడ్ యాక్సిడెంట్ వీడియో..

ఆగస్టు 9న మరో ట్వీట్..

ఆగస్టు 10న సజ్జనార్ పోస్ట్ చేసిన వీడియో.. 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..