Vizianagaram: దొంగతనం చేయడానికి వచ్చాడు.. అనంతలోకాలకు వెళ్లిపోయాడు.. అసలు ఏం జరిగిందంటే
కూల్ గా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డాడు.. కంటికి కనిపించిన వస్తువులు, డబ్బు కొట్టేశాడు.. హ్యాపీగా వెనుదిరిగాడు.. ఇంతలో ఏదో శబ్దం.. తనను ఎవరో చూశారు.. తప్పించుకోవాలి అని కంగారు పడ్డాడు..
కూల్ గా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డాడు.. కంటికి కనిపించిన వస్తువులు, డబ్బు కొట్టేశాడు.. హ్యాపీగా వెనుదిరిగాడు.. ఇంతలో ఏదో శబ్దం.. తనను ఎవరో చూశారు.. తప్పించుకోవాలి అని కంగారు పడ్డాడు.. మూడో అంతస్తు నుండి మెట్లు గుండా దిగితే దొరికి పోతానని, తొందరగా పారిపోవాలి అనుకున్నాడు.. అనుకుందే తడువు మూడో అంతస్తు నుండి కిందకు దూకాడు..పాపం మొత్తానికే పోయాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో చోటు చేసుకుంది. సాలూరు దండిగాం రోడ్డులోని వెంకటేశ్వర కాలనీలో రామేశ్వరరావు అనే ఉద్యోగి మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు.. అయితే రాత్రి వేళ తలుపులు వేసి ఆరుబయట నిద్రిస్తున్నాడు.. ఆ సమయంలోనే ఓ దొంగ వారి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడి అనుకోని పరిస్థితుల్లో మరణించాడు.. తెల్లవారుజామున అటుగా వచ్చిన ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గమనించాడు.. వెంటనే అతని వద్ద పడి ఉన్న రెండు సెల్ ఫోన్స్ ద్వారా చివరి కాల్స్ కి కాల్ చేశాడు.. తీరా చూస్తే అది రామేశ్వరరావు ఇంట్లో చోరీకి గురైన మొబైల్ గా గుర్తించారు.. అదే సెల్ ఫోన్ తో 108 కి, పోలీసులకి సమాచారం ఇచ్చాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు.. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ వ్యక్తి గంజాయి మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. మృతి చెందిన దొంగ ఎక్కడ నుండి వచ్చాడు? ఎవరూ ? ఏంటి? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..
Also Read: హీరోయిన్ మెహ్రీన్ సంచలన ప్రకటన.. ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నట్లు వెల్లడి