VIZAG Steel Recruitment 2021: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..అప్లై చేసుకోండిలా!
VIZAG Steel Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(RINIL) కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు..
VIZAG Steel Recruitment 2021: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(RINIL) కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 319 ట్రేడ్ అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. కంప్యూటర్ ఆపరేటర్, ఫిట్టర్, కార్పెంటర్, టర్నర్, మెషినిస్ట్, మెల్డర్, మెకానిక్ డిజిల్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు జులై 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే కంప్యూటర్ ఆపరేటర్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఎన్‌సీబీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిట్టర్ విభాగంలో 75 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి, ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. కార్పెంటర్ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
టర్నర్ ఈ విభాగంలో 10 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి. వెల్డర్ విభాగంలో 40 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 25 ఏళ్ల లోపు ఉండాలి.
డిజిల్ మెకానిక్ విభాగంలో 30 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఎసీవీటీ సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రీషియన్ విభాగంలో అత్యధికంగా 60 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఎన్‌సీవీటీ (NCVT) సర్టిఫికేట్ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏసీ మెకానిక్ విభాగంలో 14 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.