AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rushikonda Beach: రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజ్.. అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న ప్రతిపక్షాలు

సాధారణంగా సముద్రాన్ని మనం అందరం ఉచితంగా చూడొచ్చు. విశాఖలో కూడా అన్ని ప్రాంతాల్లో ఉచితమే కానీ ఆ ఒక్క రిషికొండ తీరం వద్ద మాత్రం బీచ్ చూడాలంటే ఇరవై రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిందే. ఈ నెల 11 నుంచి రుషికొండ వద్ద..

Rushikonda Beach: రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజ్.. అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న ప్రతిపక్షాలు
Rushikonda Beach
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jul 08, 2023 | 6:17 PM

Share

సాధారణంగా సముద్రాన్ని మనం అందరం ఉచితంగా చూడొచ్చు. విశాఖలో కూడా అన్ని ప్రాంతాల్లో ఉచితమే కానీ ఆ ఒక్క రిషికొండ తీరం వద్ద మాత్రం బీచ్ చూడాలంటే ఇరవై రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిందే. ఈ నెల 11 నుంచి రుషికొండ వద్ద బీచ్‌కు 20 రూపాయల ఎంట్రీ టికెట్ పెట్టాలని పర్యాటక శాఖా తాజాగా నిర్ణయం తీసుకుంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడే ఈ ఎంట్రీ ఫీజ్ ఎందుకంటే రుషికొండ బీచ్ ను కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ గా గుర్తించింది. దీంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు, టాయిలెట్లు, స్నానాల గదులు, పిల్లల కు స్పోర్ట్స్ ఏరీనా లాంటి ఏర్పాట్లు ఉంటాయ్. ఈ కార్యకలాపాలన్నింటిని పరిశుభ్రంగా ఉంచడం కోసం స్వీపర్లు, సెక్యూరిటీ, లైఫ్‌ గార్డులు అంతా కలిసి 39 మంది సిబ్బంది ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. వారి జీతభత్యాలకు నెలకు 6 లక్షల వ్యయం అవుతోంది. అదే సమయంలో ఈ ఖర్చంతా పర్యాటక శాఖ నే భరిస్తోంది. అదే సమయంలో పార్కింగ్‌ ఫీజు, టాయిలెట్‌, స్నానాల గదుల వద్ద ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ అవి సరిపోవడం లేదట.

మరోవైపు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బ్లూఫాగ్‌ బీచ్‌ లలో కూడా ప్రవేశ రుసుము వసూలు చేస్తుండడం తో దాన్నే రుషికొండ లో కూడా అమలు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించి ఈ నెల 11వ తేదీ నుంచి ఈ బీచ్‌కు వచ్చే వారి నుంచి రూ.20 టిక్కెట్‌ వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ టిక్కెట్‌ తీసుకునేవారు నీటి సదుపాయం, మూత్రశాలలు, స్విమ్మింగ్‌ జోన్‌, ఆటస్థలం కూడా వినియోగించుకోవచ్చు. పదేళ్ల లోపు పిల్లలకు ఫీజ్ ఉండదు. పార్కింగ్‌ ఫీజు మామూలే. మరోవైపు దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వైజాగ్ లో తాకట్టు పెట్టాలకున్నవన్నీ పెట్టేశారనీ, అమ్మలనుకున్నవన్నీ అమ్మేశారనీ, కూల్చాలనుకున్నవన్నీ కూల్చేశారనీ, వెయ్యాలకున్న పన్నులన్నీ వేసేశారన్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడేమో బీచ్‌ల వద్ద పార్కింగ్ రుసుము వసూలు చేయడం, అలాగే ఎంట్రీ ఫీజులు వసూలు చేయడం రుణంగా ఉందన్నారు. విశాఖ అనగానే అందమైన బీచ్‌లు గుర్తుకొస్తాయి. సముద్రతీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని వైజాగ్‌ వాసులు సాయంత్రం అలా బీచ్‌కు వెళ్తుంటారు. ఐతే ఇకపై ‘బ్లూ’ ఫాగ్ గా గుర్తింపు ఉన్న రుషి కొండ బీచ్‌కు వెళ్లాలంటే 20 రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారని గంటా విమర్శించారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే బీచ్ ల వద్ద పార్కింగ్ రుసుం కింద ద్విచక్ర వాహనాలకు 10, కార్లకు 30, బస్సులకు 50 వసూలు చేస్తున్నారనీ, ఇంకా బీచ్ లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజ్ అంటే ఎలా ఆన్న గంటా తీరం అందాలు ఆస్వాదించడానికి ప్రభుత్వమే అత్యాధునిక సదుపాయాలతో బీచ్‌లను డెవలప్‌ చేసి పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా చేయాల్సిందిపోయి ఎంట్రీ ఫీజులు పేరుతో వారి నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఎంట్రీ టిక్కెట్ల పై వెంటనే పునారాలోచన చెయ్యాలనీ కోరారు గంటా శ్రీనివాస్‌.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి