Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ అస్థిపంజరం కేసులో వీడిన మిస్టరీ.. మృతుడు ఎవడు, ఎలా చనిపోయాడంటే?
విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో అస్తిపంజరం కేసు మిస్టరీ దాదాపు వీడినట్టే. మృతుడు ఎట్టకేలకు గుర్తించ్చారు. ఇచ్చాపురం కు చెందిన కోటేశ్వరరావుగా నిర్ధారించారు పోలీసులు. చెట్టుపై నుంచి జారీ పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లో అస్తిపంజరం కేసు మిస్టరీ దాదాపు వీడినట్టే. మృతుడు ఎట్టకేలకు గుర్తించ్చారు. ఇచ్చాపురం కు చెందిన కోటేశ్వరరావుగా నిర్ధారించారు పోలీసులు. చెట్టుపై నుంచి జారీ పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. శాస్త్రీయంగా మృతుడు గుర్తింపు తెలా ల్సిఉంది. కాగా ఘటనా స్థలంలో లభించిన కత్తి.. హత్య..? ప్రమాదమా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. మృతుడుని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేసాయి. అస్థిపంజరం దగ్గర పర్సు డెబిట్ కార్డు లభించింది.. ఆ అస్తిపంజరం అతనిదేనా..?! అన్న కోణంలో దర్యాప్తు సాగింది. డెబిట్ కార్డ్ గల వ్యక్తి బతికే ఉండడంతో.. మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదటికి వచ్చింది. చివరకు మృతుడిని గుర్తించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కు చెందిన కోటేశ్వరరావుగా గుర్తించారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్టుంది. విశాఖ గాజువాక ఉక్కునగరంలో శనివారం కలకలం సృష్టించిన ఆస్థిపంజరం కేసు మిస్టరీ చేదించేందుకు పోలీసులు శ్రమించారు. ఘటనా స్థలంలో అస్తిపంజరం తో పాటు ఓ కత్తి కూడా ఉండడంతో హత్య జరిగి ఉంటుందా అన్న అనుమానం మొదలైంది. అస్తిపంజరం దగ్గర ఉన్న ఓ ప్యాంటులో బ్యాంకు ఏటీఎం కార్డ్, పర్సు లభించయి. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. పర్సు, ఏటీఎం కార్డు సబ్బవరం చెందిన వ్యక్తిదిగా గుర్తించారు పోలీసులు.
బతికే ఉన్నాడు..!
– పోలీసులు విచారణలో భాగంగా… సబ్బవరం లో పర్సు గల వ్యక్తి బతికే ఉన్నట్టు తెలుసుకున్నారు. 2021లో పర్సు పోయినట్టుగా గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత డెబిట్ కార్డును బ్లాక్ చేయించినట్టు కూడా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఘటనా స్థలంలో లభించిన కత్తి ఆస్తిపంజరాన్ని చూసి చాలా మంది భయపడ్డారు. ఎవరో హత్య చేసి పడేసి ఉంటారని అనుమానించారు. అయితే పోలీసులు మాత్రం దాన్ని నిర్ధారించలేదు. ప్రమాదవశాత్తు మరణించి ఉంటాడని అనుమానించారు. చెట్టుపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావించారు. అదే నిజమైంది. మతుడు ఇచ్చాపురం చెందిన కోటేశ్వరరావు గుర్తించి… గత కొంతకాలంగా భార్యా పిల్లలకు దూరంగా ఉంటున్నట్టు గుర్తించారు. విశాఖలోని దేశపాత్రునిపాలెంలో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు కోటేశ్వరరావు. కుటుంబ సభ్యులకు కూడా సహజీవనం చేస్తున్న మహిళ దగ్గర ఉన్న ఫోటో, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కోటేశ్వరరావు గా గుర్తించారు. అయితే మేకల మేత కోసం చెట్టు ఎక్కిన కోటేశ్వరరావు.. ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. అయితే కుటుంబ సభ్యుల డీఎన్ఏ తో సరి పోల్చాల్సి ఉంది.





Visakha Steel Plant Skeleton case
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..