రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే సింపుల్ హోం రెమిడీస్.. వారంలో ఫలితం చూస్తారు..!
ఆ మర్నాడు ఉదయం పరగడుపునే ఆ నీటిని తాగాలి. క్రమం తప్పకుండా కొద్ది రోజులు ఇలా చేస్తే మీ ఆరోగ్యంలో గొప్ప మార్పును గమనిస్తారు. అలాగే, మీరు తినే ఆహారంలో కరివేపాకును కూడా ఎక్కువ మోతాదులో చేర్చుకోవటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది
ఈ రోజుల్లో మధుమేహం సర్వసాధారణం. శరీరంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంట్లోనే తగ్గించుకునేందుకు అనేక మార్గాలు, సింపుల్ చిట్కాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కాకరకాయ రసం మధుమేహానికి చాలా మంచిది. కాకరకాయలో కెరోటిన్, మోమోర్డెసిన్ ఉంటాయి. ఈ రెండు సమ్మేళనాలకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కాకరకాయ రసం తీసుకోవడం మంచిది.
మధుమేహ బాధితులకు మరో దివ్యౌషధం వంటిది అల్లనేరెడు పండు. ఇది సీజనల్ ఫ్రూట్. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మంచిది. ముఖ్యంగా అల్లనేరెడు పండు గింజల పొడి షుగర్ బాధితులకు అద్భుతంగా పనిచేస్తుంది.ఈ పొడిని నీటిలో కలుపుకుని ఖాళీ కడుపుతో తాగినట్టయితే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. అలాగే, అల్లం కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ అల్లం వేసి మరిగించిన నీటిని తాగడం మంచి పద్ధతి.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మెంతి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల మెంతిగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఆ మర్నాడు ఉదయం పరగడుపునే ఆ నీటిని తాగాలి. క్రమం తప్పకుండా కొద్ది రోజులు ఇలా చేస్తే మీ ఆరోగ్యంలో గొప్ప మార్పును గమనిస్తారు. అలాగే, మీరు తినే ఆహారంలో కరివేపాకులను ఎక్కువ మోతాదులో చేర్చుకోవటం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇది సహజ యాంటీఆక్సిడెంట్. ఇది అధిక రక్త చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది.
వీటితో పాటు, ప్రాణాయామం, బ్రితింగ్ ఎక్సర్‌సైజులతో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రాణాయామం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహాన్ని సులభంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..