- Telugu News Sports News Cricket news Icc world cup qualifier Sri Lanka won by 8 wickets against West Indies team and wi officially withdrawn from the World Cup 2023
SL vs WI: ఓటమితో వన్డే ప్రపంచకప్‌నకు కన్నీటి వీడ్కోలు.. దయనీయ స్థితిలో రెండుసార్ల ప్రపంచ విజేత..
ICC World Cup Qualifier: స్కాట్లాండ్‌తో జరిగిన డూ-ఆర్ డై మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో అధికారికంగా ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది.
Updated on: Jul 08, 2023 | 1:45 PM

ICC World Cup Qualifier: స్కాట్లాండ్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన వెస్టిండీస్ జట్టు అధికారికంగా ప్రపంచ కప్ నుంచి వైదొలిగింది. ఆ తర్వాత లాంఛనంగా మిగిలిన రెండు మ్యాచ్ లు ఆడిన వెస్టిండీస్ జట్టు ఒకదానిలో గెలిచి, మరో మ్యాచ్ లో ఓడి ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించింది.

ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి 243 పరుగులు చేసింది. మరోసారి ఆ జట్టు బ్యాటింగ్ విభాగం విఫలమైంది. జట్టు తరపున కేసీ కార్తీ 87 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

243 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక 44.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టు తరపున ఓపెనర్ పాతుమ్ నిసంక సెంచరీ చేయగా, మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నే 83 పరుగులతో విజయవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

శ్రీలంక తరుపున 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మహిష్ తిక్షన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, బ్రూక్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, కేసీ కార్టీ, కైల్ మేయర్స్, రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అకిల్ హొస్సేన్

శ్రీలంక జట్టు: పాతుమ్ నిసంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, సహన్ అరాచిగే, దసున్ షనక, దుషన్ హేమంత, మహిష్ తిక్షన్, మతీషా పతిరన, దిశన్ మధుశంక




