IND vs WI: గొప్ప మనసును చాటుకున్న హైదారాబాదీ.. విండీస్ యువ ఆటగాళ్లకు సెల్ఫీ, ఆటోగ్రాఫ్ కాకుండా..
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు కరేబియన్ దీవుల్లో కాలు మోపిన భారత ఆటగాల్లు ముందుగా బార్బడోస్ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లను చూడడానికి వచ్చిన ఔత్సాహిక యువ..
Team India: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు కరేబియన్ దీవుల్లో కాలు మోపిన భారత ఆటగాల్లు ముందుగా బార్బడోస్ వేదికగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీ, అశ్విన్, ఇషాన్ కిషన్ వంటి పలువురు టీమిండియా ఆటగాళ్లు.. ప్రాక్టీస్ చూడడానికి వచ్చిన ఔత్సాహిక యువ క్రికెటర్లకు మనోళ్లు ఆట గురించి తమ అనుభవం మేరకు సలహాలను అందించారు. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలతో పాటు సరదాగా సంభాషించుకున్నారు. అయితే హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం స్థానిక ఆటగాళ్లకు బ్యాట్, షూస్ అందజేశాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైలర్ అవుతోంది.
ఇక టూర్ విషయానికి వస్తే టెస్ట్ టీమ్‌లో చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ఆటగాడికి అవకాశం లభించలేదు. ఇంకా రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ముకేష్ కుమార్, నవదీప్ సైనీ వంటి యువ ఆటగాళ్లకు టెస్ట్ స్క్వాడ్‌లో అవకాశం లభించింది. మరోవైపు టీ20 టీమ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి అవకాశం లభించలేదు. ఈ మేరకు హార్దిక్ పాండ్యా భారత జట్టును నడిపించనున్నాడు.