Cricket: 8 సిక్సర్లు, 13 ఫోర్లు, 21 బాల్స్‌తోనే సెంచరీ..! బ్యాట్‌తో చెలరేగిన 21 ఏళ్ల యువ క్రికెటర్..
BAN vs AFG: క్రికెట్‌లో రికార్డులు నమోదు కావడం, కొంతకాలానికి అవి బద్ధలుకావడం అనేది సర్వసాధారణమైన విషయం. కొంతకాలం నుంచి యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. క్రికెట్‌లో పసికూనలు అనుకున్న జట్ల తరఫున కూడా బౌలింగ్, బ్యాటింగ్‌తో యువ క్రికెటర్లు..
BAN vs AFG: క్రికెట్‌లో రికార్డులు నమోదు కావడం, కొంతకాలానికి అవి బద్ధలుకావడం అనేది సర్వసాధారణమైన విషయం. కొంతకాలం నుంచి యువ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. క్రికెట్‌లో పసికూనలు అనుకున్న జట్ల తరఫున కూడా బౌలింగ్, బ్యాటింగ్‌తో యువ క్రికెటర్లు తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే 21 ఏళ్ల ఆఫ్ఘానిస్తాన్ టీమ్ ఓపెనర్ బంగ్లాదేశ్‌పై అద్భుత ప్రదర్శన చేయడమే కాక కేవలం 21 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అతనే కాదు అతనికి జోడిగా దిగిన మరో ఓపెనర్ కూడా సెంచరీతో చెలరేగాడు. మరి కొన్ని వారాల్లో ఆసియా కప్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘాన్ ప్లేయర్లు చెలరేగడం చర్చనీయాంశమైంది.
అసలు విషయం ఏమిటంటే.. ఆఫ్ఘాన్ ఓపెనింగ్ బ్యాట్స్‌మ్యాన్ రహ్మానుల్లా గుర్భాజ్ 125 బంతుల్లో 145 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 13 ఫోర్లతో 52 పరుగులు, 8 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. అంటే కేవలం 21 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేశాడు. ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో గుర్భాజ్ ఈ ప్రదర్శన చేశాడు. ఇంకా అతనితో పాటు ఆఫ్ఘాన్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఇబ్రహిమ్ జద్రాన్(100) కూడా సెంచరీతో చెలరేగాడు. అలాగే గుర్భాజ్-జద్రాన్ జోడీ ఆఫ్ఘనిస్తాన్ తరఫున తొలి వికెట్‌కు 256 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆఫ్ఘానిస్తాన్ తమ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.
📹: @RGurbaz_21 reacts to his 1️⃣4️⃣5️⃣!#AfghanAtalan | #BANvAFG2023 | #XBull pic.twitter.com/NyOXm54QBo
— Afghanistan Cricket Board (@ACBofficials) July 8, 2023
అనంతరం క్రీజులోకి వచ్చిన బంగ్లా బ్యాటర్లు ముందునుంచే చేతులెత్తేశారు. ముష్ఫికర్ రహీమ్ 69 పరుగులతో రాణించగా.. షకిబ్ అల్ హాసన్ 25, మెహిడీ హాసన్ మిరాజ్ 25 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో బంగ్లా టీమ్ 189 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా ఆఫ్ఘానిస్థాన్ 142 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.
ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ XI: హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, ముజీబ్ ఉర్ రహమాన్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ సలీమ్.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI: లిటన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ నయీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), అఫీఫ్ హుస్సేన్, మెహదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ఇబాదోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..