ICC World Cup 2023: భారత్ వచ్చేందుకు ఆసక్తి చూపని పాకిస్తాన్? కుంటిసాకులతో కాలాయాపన..
ICC World Cup 2023: అక్టోబర్-నవంబర్‌లలో భారతదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ జట్టు పాల్గొనలేదా? ఈ ప్రశ్నకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంకా ఐసీసీకి సమాధానం ఇవ్వలేదు.
ICC World Cup 2023: భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడం లేదా? ఇప్పటి వరకైతే పీసీబీ ఇంకా ఐసీసీకి సమాధానం ఇవ్వలేదు. అయితే, వన్డే ప్రపంచకప్ 2023లో పాక్ జట్టు పాల్గొనడంపై పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో ఓ కమిటీని వేరు. భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలతో క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచే విషయాలపై ఈ కమిటీ చర్చిస్తుంది. ఈ ప్యానెల్ సభ్యులు భారతదేశంలోనూ పర్యటించనున్నట్లు సమాచారం వస్తోంది. ఆ తర్వాత పాక్ ప్రధానికి రిపోర్ట్ సమర్పించి, ఆ తర్వాతే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారంట.
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే పాక్ జట్టు పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, పాక్ టీం ఆడాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమంటూ పీసీబీ ఐసీసీకి చెప్పుకొచ్చింది.
ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి పాకిస్తాన్ పీఎం షాబాజ్ షరీఫ్ స్పోర్ట్స్ మినిస్టర్ అహ్సాన్ మజారీ, అసద్ మహమూద్, మరియం ఔరంగజేబ్, కమర్ జమాన్ కైరా, అమీన్ ఉల్ హక్, మాజీ దౌత్యవేత్త తారిఖ్ ఫాత్మీలతో కూడిన ప్యానల్‌ను ఏర్పాటు చేశారు.
భారత్‌లో భద్రతను పరిశీలించేందుకు పాకిస్థాన్ టీం ఆడే మైదానాలను చెక్ చేసేందుకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపనున్నారు. ఆ తరువాత తుది నివేదికను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధిపతి కూడా ప్రధానికి సమర్పించనున్నారు. నివేదికను పరిశీలించిన తర్వాత పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వేదికల్లో పాకిస్తాన్ టీం మ్యాచ్‌లు ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరు కోసం ప్రపంచం వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనడానికి భద్రతా కారణాలను సాకుగా చెప్పడం వింతగా అనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..