Raw Honey: తుట్టె నుంచి తీసిన ముడి తేనె ఆరోగ్యానికి మంచిదేనా..? తెలుసుకుందాం రండి..
Raw Honey: మార్కెట్‌లో లభించే తేనె కాకుండా తెనేతుట్టె నుంచి నేరుగా తీసిన తేనెను ముడి తేనె అంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదనే ప్రచారాలు, అభిప్రాయాలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముడితెనేతో ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 08, 2023 | 3:14 PM

ముడి తేనెలో ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్ వంటి పలు రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తాయి.

తేనె మధుమేహం నుంచి రక్షించగల శక్తిని కలిగి ఉంది. ఇంకా ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదు.

ముడి తేనెలో యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వల్ల వైరల్ ఫీవర్, గజ్జీ, తామర వంటి సమస్యలను నిరోధించవచ్చు.

ముడి తేనెలో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫాస్పరస్, పోటాషియం, రెబోప్లొవిన్, జింక్ వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి.

ముడి తేనెను గాయాలపై రాసినట్లయితే అవి తొందరగా మానిపోయే అవకాశం ఎక్కువ.

అయితే పచ్చి తేనెను అధికంగా తీసుకోవడం వల్ల తేనె విషంగా మారే ప్రమాదం ఉంది. ఫలితంగా తల తిరగడం, వికారం, వాంతులు, రక్తపోటు తగ్గడం వంటి లక్షణాలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది.




