AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట.. వరంగల్‌ వేదికగా నిరుద్యోగులకు ప్రధాని వరాల జల్లు..!

ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద యూనిట్ అవుతుంది.  మొదటిది పశ్చిమ బెంగాల్లో ఉంది. ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో వ్యాగన్ల కొరత ఉన్నందున వ్యాగన్ తయారీ యూనిట్ కాజీపేటలో ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ తయారయ్యే వ్యాగన్ లతో ఇండియన్ రైల్వే లో సరుకు రవాణా మెరుగు పడుతుందన్నారు.

వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట.. వరంగల్‌ వేదికగా నిరుద్యోగులకు ప్రధాని వరాల జల్లు..!
Wagon Production Center In
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Jul 08, 2023 | 12:56 PM

Share

ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాని మోదీ విచ్చేశారు. కాజీపేట సమీపంలోని మడికొండలో భారీ పెట్టుబడితో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించారు. 160 ఎకరాల స్థలంలో520 కోట్ల అంచనా బడ్జెట్ తో వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగనుంది. కాజీపేట్ ఇప్పటివరకు రైల్వే ఓవరాలిన్గ్ యూనిట్ కు పరిమిషన్ ఉంది. కానీ, ఇప్పుడు ఓవరలింగ్ యూనిటీ తో పాటు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది కేంద్రం.  రైల్వే కొత్త ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4000 మందికి ఉద్యోగ కల్పన జరగనుంది అని రైల్వే అధికారులు అంటున్నారు.  2025 వరకు ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి యూనిటీ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. వ్యాగన్  యూనిటీ ప్రారంభమైన మొదటి సంవత్సరం 1200 వ్యాగన్లు, రెండవ సంవత్సరం 2400 వ్యాగన్లు తయారు చేస్తామని అధికారులు అంటున్నారు.  మొత్తం గా నెలకి 200 వాగన్ లు ఉత్పత్తి జరుగుతుంది.

కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద యూనిట్ అవుతుంది.  మొదటిది పశ్చిమ బెంగాల్లో ఉంది. ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో వ్యాగన్ల కొరత ఉన్నందున వ్యాగన్ తయారీ యూనిట్ కాజీపేటలో ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ తయారయ్యే వ్యాగన్ లతో ఇండియన్ రైల్వే లో సరుకు రవాణా మెరుగు పడుతుందన్నారు. .ఓపెన్, క్లోజ్, వాగన్ లతో పాటు అన్ని రకాల సరుకు రవాణా కి ఉపయోగపడే విధంగా వ్యాగన్ లు రెడీ అవుతాయని అధికారులు అంటున్నారు.

ఇండియన్ రైల్వే లో వ్యాగన్, కోచ్ ల కొరత ఉన్నప్పటికి విలువలో రెండూ సమానం అని.. దేశంలో ఇప్పటికే చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ, కాజీపేట కి కోచ్ ఫ్యాక్టరీ రావాలని కల ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం  వ్యాగన్ ఫ్యాక్టరీ కి అనుమతి ఇచ్చింది. దీంతో ఆ దిశగా శంకుస్థాపన జరిగింది. 2025 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి వ్యాగన్ లు తయారీ మొదలు కానున్నాయి అని అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!