దేవతలకు సారె సాంప్రదాయం ఎందుకో తెలుసా..? శాకాంబరీ దేవి అలంకారంలో విశిష్టత ఏంటంటే..
ఏలూరు: ఆషాఢమాసం వచ్చిందంటే చాలు బెజవాడ కనకదుర్గమ్మ, భీమవరం మావుళ్ళమ్మ తో సహా అన్ని ప్రముఖ ఆలయాల్లో అమ్మవార్ల ను శాకాంబరీ దేవిగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, రకరకాల ఆకుకూరలతో అలంకరిస్తారు. అదే సమయంలో ఆషాడసారెను లాంఛనంగా సమర్పిస్తారు భక్తులు. ఆషాడసారె సమర్పించటం సాంప్రదాయంగా వస్తున్న కార్యక్రమం.