- Telugu News Photo Gallery Cinema photos Sai Pallavi Shares Beautiful Nature Photos in her Vacation see here telugu cinema news
Sai Pallavi: ఇప్పుడు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది.. అందమైన ఫోటోస్ షేర్ చేసిన సాయి పల్లవి..
తాజాగా సాయి పల్లవి బ్యూటీఫుల్ నేచర్ పిక్స్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇప్పుడు తన మనస్సు ప్రశాంతంగా ఉందని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఫోటోస్ చూస్తుంటే సాయి పల్లవి వెకేషన్ లో ఉందని అర్థమవుతుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Jul 08, 2023 | 12:13 PM

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చివరిసారిగా గార్గి చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు.

అంతేకాకుండా.. చాలా కాలం సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని వార్తలు వినిపించాయి.

అయితే ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆమె తమిళ్ స్టార్ శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. నెట్టింట చాలా సైలెంట్ ఉంటోన్న ఈ న్యాచురల్ బ్యూటీ అప్పుడప్పుడు తన ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.

తాజాగా సాయి పల్లవి బ్యూటీఫుల్ నేచర్ పిక్స్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇప్పుడు తన మనస్సు ప్రశాంతంగా ఉందని క్యాప్షన్ ఇచ్చింది.

అయితే ఫోటోస్ చూస్తుంటే సాయి పల్లవి వెకేషన్ లో ఉందని అర్థమవుతుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.




