- Telugu News Photo Gallery Indian railway plans to redevelop gorakhpur railway station old and new comparison Telugu news
కింద రైలు, పైన షాపింగ్ మాల్.. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఆధునాతన రైల్వే స్టేషన్.. ఎక్కడ, ఎలా ఉంటుందో తెలుసా..?
కింద రైలు, పైన షాపింగ్ మాల్, రూ.498 కోట్లతో నిర్మించనున్న గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది? ఇది స్ట్రక్చరల్ డిజైన్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ జూలై 7న ప్రారంభమైంది.
Updated on: Jul 08, 2023 | 1:24 PM

దాదాపు రూ.498 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ పథకం ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తుంది.

రైల్వేస్టేషన్ జనంతో కిక్కిరిసి ఉండడంతో నిర్వహణపై పూర్తి దృష్టి సారిస్తున్నారు. కొత్త రైల్వే స్టేషన్‌తో రాబోయే 50 సంవత్సరాలకు ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి ప్రణాళిక రూపొందించారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ కొత్త స్టేషన్ విదానం అమలుచేస్తున్నారు.

కొత్తగా పునరుద్ధరించబడిన గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో హోటల్, షాపింగ్ మాల్, ఆసుపత్రి సౌకర్యాలు ఉంటాయి. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఇంతవరకు పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ 6,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించబడింది. రద్దీ లేకుండా ఒకే సమయంలో 3,500 మంది వేచి ఉండే విధంగా నిర్మాణాన్ని రూపొందించారు.

గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ దాని పాత వారసత్వం, చిహ్నాలను ఎప్పటికీ చెరగపోనివ్వకుండా సుసంపన్నమైన వారసత్వాన్ని పూర్తిగా పరిరక్షించేందుకు పునరావాస రైల్వే స్టేషన్‌ను కూడా నిర్మించనున్నారు.

కొత్తగా పునరుద్ధరించబడిన గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో హోటల్, షాపింగ్ మాల్, ఆసుపత్రి సౌకర్యాలు ఉంటాయి. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఇంతవరకు పార్కింగ్ సమస్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.





























