సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేశారు

సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలేశారు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన నేత నాగబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా వార్‌ నడుస్తోంది. ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌పై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై... జనసేన నేత.. నాగబాబు తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి..

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 13, 2020 | 1:02 PM

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన నేత నాగబాబుల మధ్య ట్విట్టర్ వేదికగా వార్‌ నడుస్తోంది. ఇద్దరు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌పై విజయసాయి చేసిన వ్యాఖ్యలపై… జనసేన నేత.. నాగబాబు తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. దీంతో ఇరువురి నేతల మధ్య ట్విట్టర్ వార్‌ మొదలైంది. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌‌ను ప్రభుత్వం తొలగించడంపై పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌పై స్పందించిన విజయసాయిరెడ్డి రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్… హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయాలు చేయడమేంటని… ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా? అంటూ విజయసాయి ట్వీట్‌ చేశారు. దీనికి నాగబాబు సైతం కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి చెప్పింది కరెక్టే అంటూ ఎదవ రాజకీయాలు చేయడం తమకు తెలియదని ఘాటుగా స్పందించారు. మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్‌తో దోస్తీకి రెడ్డి అన్న సంగతేంటని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు నాగబాబు.

ఇక నాగబాబుకు ట్వీట్‌కు విజయసాయిరెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు. సినిమాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికి వదిలేసిన వారికి రాజకీయాలు ఎందుకని ట్వీట్‌ చేశారు. 2014లో తాము పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులపై పార్టీ అధినేత జగన్‌ మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారన్నారు. అయితే, విజయసాయిరెడ్డి తన ఇంటికి వచ్చింది 2014లో కాదని, 2019 ఎన్నికల ముందంటూ నాగబాబు గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ ఆడిటర్ కాకపోయి ఉంటే ఎవరికి తెలిసేదని నాగబాబు స్ట్రాంగ్‌గా స్పందించారు. మొత్తానికి ఇద్దరి నేతల మధ్య ట్విట్టర్‌ సాక్షిగా ఆరోపణలు.. ప్రత్యారోపణల యుద్ధం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి:

రిలయన్స్ శాస్త్రవేత్తల పరిశోధన.. సముద్ర నాచుతో కరోనాకి చెక్?

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన జేసీ

లాక్‌డౌన్-2.0కు మార్గదర్శకాలు సిద్ధం చేస్తోన్న కేంద్రం

సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu