సీఎం కేసీఆర్ చెప్పిన ‘హెలికాఫ్టర్ మనీ’కి అర్థమేంటంటే..?

హెలీకాఫ్టర్ మనీ అంటే ఏంటంటే.. ప్రజలకు ఉచితంగా డబ్బు ఇవ్వడం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్ మ్యాన్ 1969‌లో ఈ విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి..

సీఎం కేసీఆర్ చెప్పిన 'హెలికాఫ్టర్ మనీ'కి అర్థమేంటంటే..?
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 9:44 PM

కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి కేంద్ర ప్రభుత్వం. కానీ దీని కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. వస్తు, సేవల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో ఆర్థిక వ్యవ్వస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోవచ్చని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు హెలికాఫ్టర్ మనీ, క్యూఈ ఆర్థిక విధానాలు చేపట్టాలని ప్రధానికి సీఎం కేసీఆర్ సూచించడం వల్ల ఇవి తెరపైకి వచ్చాయి.

హెలీకాఫ్టర్ మనీ అంటే ఏంటంటే.. ప్రజలకు ఉచితంగా డబ్బు ఇవ్వడం. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్థిక వేత్త ఫ్రెడ్ మ్యాన్ 1969‌లో ఈ విధానాన్ని ప్రతిపాదించారు. 2002లో ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ బెన్ బెర్నాంకే దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ విషయంలో మన దేశంలో ఆర్బీఐ కీలక పాత్ర వహించాలి. దీని ప్రకారం నోట్ల ముద్రణ పెంచి ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద ఎత్తున నగదును చలామణీలోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్ధేశం.

ప్రజలకు నేరుగా డబ్బులు చేరవేసి వారి కొనగోలు శక్తిని పెంచడం దీని వెనుకున్న ఆంతర్యం. ప్రస్తుతం ప్రజల వద్ద డబ్బులు లేక కొనుగోలు బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ను, సప్లయ్‌ను పెంచడానికి ఈ విధానం దోహద పడుతుంది. క్వాంటిటేటివ్ ఈజింగ్ కూడా ఇలాంటిదే అయినా దీనికి ప్రభుత్వం వద్ద నుంచి ఆర్బీఐ బాండ్లు కొనుగోలు చేస్తుంది. కాగా ఇంతకుముందు ఈ విధానాన్ని అమెరికా, జపాన్ వంటి దేశాలు అవలంభించాయి. 2008లో సంభవించిన ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమెరికా హెలీకాఫ్టర్ మనీ విధానాన్ని అనుసరించింది. అలగే 2016లో జపాన్ సైతం హెలీకాఫ్టర్ మనీ విధానాన్ని అవలంభించింది.

కాగా నోట్లను ఎందుకు ఎల్లప్పుడూ ముద్రించరనే ప్రశ్న తలెత్తవవచ్చు. దేశంలో వస్తుసేవల ఉత్పత్తి ఆధారణంగా ఈ నోట్లను ముద్రించి.. ఆర్బీఐ చలామణీలోకి తీసుకొస్తుంది. ఒకవేళ నిత్యం నోట్లను పెద్ద సంఖ్యలో ముద్రించి జనాలకు చేరవేస్తే కొన్నాళ్లు రూపాయి విలువ మరింత దారుణంగా పడిపోయి.. ద్రవ్యోల్బణం భారీ స్థాయిలో పెరిగిపోతుంది.

ఇవి కూడా చదవండి:

ఈ దెబ్బకు జగన్ ఉద్యోగం ఊడినా ఆశ్చర్యపోనవసరం లేదు

ఐసోలేషన్, క్వారంటైన్‌కు మధ్య తేడాలేంటంటే?

హ్యాకర్ల నుంచి మీ ఫోన్‌ను రక్షించుకోండిలా..!

కరోనా బాధితుల్లో స్మోకింగ్ చేసేవారే ఎక్కువ

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..