మ‌రోసారి జాతీయ స్థాయిలో మెరిసిన సింగరేణి

తెలంగాణాలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అరుదైన ఘనతను దక్కించుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్దగల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం..

మ‌రోసారి జాతీయ స్థాయిలో మెరిసిన సింగరేణి
Follow us

|

Updated on: Apr 17, 2020 | 7:25 AM

తెలంగాణాలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అరుదైన ఘనతను దక్కించుకుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్దగల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 87.53 శాతం పి.ఎల్.ఎఫ్.తో జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచి తన ప్రతిభను మరోసారి చాటుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ప్లాంటు జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచి రికార్డుల‌కెక్కింది.  ప్లాంట్ ఈ ఘ‌నత సాధించ‌డంపై సింగ‌రేణి చైర్మన్, ఎండి ఎన్. శ్రీధర్ ఆనందం వ్య‌క్తం చేశారు.

మంచిర్యాల జిల్లా జైపూర్ వద్దగల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 87.53 శాతం పి.ఎల్.ఎఫ్.తో జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలింది. ఈ సంద‌ర్భంగా సంస్థ చైర్మన్ అండ్ ఎం డి ఎన్. శ్రీధర్ దీనిపై తన హర్షం ప్రకటిస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీరుస్తూ మరింత మెరుగైన పనితీరులో ముందుకు సాగాలని ప్లాంట్ అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గతంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ప్లాంటు జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచి తన సత్తాను చాటింది.కేవలం మూడున్నర ఏళ్ల వయసు గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ విధంగా జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యుత్ కేంద్రాల్లో ఒకటిగా నిలవడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు.

2019 -20 ఆర్థిక సంవత్సరంలో ఈ స్టేషన్ 9,227 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసి ,దానిలో 8,672 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం గజ్వేల్ లోని గ్రిడ్ కు సరఫరా చేసింది .ఈ స్టేషన్ లోగల రెండు 600 మెగావాట్ల యూనిట్లు కూడా అనేకసార్లు నూరు శాతం పైబడి పి.ఎల్.ఎఫ్. సాధించడం గమనార్హం. సంస్థ చైర్మన్ అండ్ ఎం. డి శ్రీ ఎం శ్రీధర్ స్వయం పర్యవేక్షణ ,దిశానిర్దేశం లో సింగరేణి విద్యుత్ కేంద్రం మొదటి నుండి మంచి రికార్డులు నెలకొల్పుతూ దేశంలో గల అత్యుత్తమ పవర్ ప్లాంటు ల్లో ఒకటిగా నిలుస్తూవస్తోంది. ఈ కేంద్రం 2018 -19 ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు నూరు శాతం పి.ఎల్.ఎఫ్. సాధించింది . 2018 సెప్టెంబర్ లో100.04శాతం, 2019 ఫిబ్రవరిలో 100.05శాతం శాతం సాధించింది. అలాగే 2019-20లో ఒకసారి ఫిబ్రవరి 2020 లో100.18 శాతం పి. ఎల్.ఎఫ్ సాధించింది. కాగా ప్లాంట్ లో గల రెండు యూనిట్లు గత మూడున్నర సంవత్సరాల కాలంలో 15 సార్లు నూరుశాతం పి.ఎల్.ఎఫ్ సాధించడం గమనార్హం .

ప్లాంట్లో గల రెండ‌వ యూనిట్ మొత్తం 9సార్లు,మొదటి యూనిట్ 6సార్లు నూరు శాతం పై బడి పి.ఎల్ ఎఫ్ సాధించాయి. రెండవ యూనిట్ 2017సంవత్సరం లో ఫిబ్రవరి,మే,నవంబర్ నెలల్లో,2018లో జూలై,సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో,2019లో జనవరి,ఫిబ్రవరి నెలల్లో,2020లో ఫిబ్రవరి నెలలో 100శాతం పి.ఎల్.ఎఫ్ సాధించింది. మొదటి యూనిట్ 2017 లో ఎప్రిల్,డిసెంబర్ నెలల్లో,2018లో సెప్టెంబర్ ,నవంబర్ నెలల్లో, 2019లో ఫిబ్రవరి నెలలో, 2020లో కూడా ఫిబ్రవరి నెలలో నూరుశాతం పి.ఎల్ ఎఫ్ .సాధించింది. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభం నుండి మార్చ్ 2020వరకు 31,750మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా దీనిలో 29,833 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అందించ గలిగింది.