Andhra News: హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా..

విజయవాడ.. హైదరాబాద్ హైవే.. వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది.. వేలాది వాహనాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. అయితే.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు రయ్యిరయ్యిన దూసుకువస్తోంది.. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆపేందుకు ప్రయత్నించారు.. కానీ.. కారు మాత్రం ఆగలేదు.. అదే స్పీడుతో డ్రైవర్ వెనుకకు తిప్పడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది..

Andhra News: హైవేపై పోలీసులను చూసి పరుగులు పెట్టిన కారు.. ఛేజ్ చేసి పట్టుకోగా..
Ganja Seized
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 07, 2025 | 4:49 PM

విజయవాడ.. హైదరాబాద్ హైవే.. వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంది.. వేలాది వాహనాలు వస్తున్నాయి.. పోతున్నాయి.. అయితే.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారు రయ్యిరయ్యిన దూసుకువస్తోంది.. ఈ క్రమంలో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆపేందుకు ప్రయత్నించారు.. కానీ.. కారు మాత్రం ఆగలేదు.. అదే స్పీడుతో డ్రైవర్ వెనుకకు తిప్పడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది.. కారు ఆగకుండా దూసుకెళుతుండటంతో పోలీసులు.. కూడా తమ వాహనాలతో వెంబడించారు.. చివరకు కారు ఓ ఊరిలోకి ప్రవేశించింది.. దానిలో ఉన్న వ్యక్తులు.. నివాస ప్రాంతాల్లో కారును వదిలేసి పారిపోయారు.. కారు దగ్గరకు వెళ్లిన పోలీసులు.. దానిలో ఏముందా అని చెక్ చేశారు.. డిక్కిని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాకయ్యారు.. కారులోంచి భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన NTR జిల్లా జగ్గయ్యపేట పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

విజయవాడ హైదరాబాద్ హైవే పై కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎన్టీఆర్ జిల్లా గౌరవరం వద్ద నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు ప్రారంభించారు.. ఈ క్రమంలో పోలీసులను చూసి కారు డ్రైవర్ ఆకస్మాత్తుగా కారును ఆపాడు.. అనంతరం గౌరవరం గ్రామంలోకి కారును తిప్పి డ్రైవర్ తప్పించుకోబోయాడు.. దీంతో పోలీసులు ఛేజ్ చేసి కారును పట్టుకున్నారు.. ఈ క్రమంలో కారు వదిలి దుండగులు పరారయ్యారు.

వీడియో చూడండి..

అనంతరం కారును పోలీసులు చెక్ చేశారు.. కార్ డిక్కీ తెరచి చూడగా గంజాయ్ పట్టుబడింది.. కారులో పార్సిల్ చేసిన 70 కిలోల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని.. గంజాయ్ దందా గురించి ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..