Sachin Tendulkar: సచిన్ ఎవరు? క్రికెట్ గాడ్ తెలియదంటూ షాకిచ్చిన లేడీ జహీర్ ఖాన్..
Sushila Meena: భారత వెటరన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ అమ్మాయి వీడియోను షేర్ చేశాడు. అచ్చం జహీర్ ఖాన్ బౌలింగ్ లానే ఉందంటూ వీడియోను పంచుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఈ అమ్మాయి సోషల్ మీడియాలో పాపులర్ అయింది. అయితే సచిన్ ఎవరో తెలియదంటూ బిగ్ షాక్ ఇచ్చింది.
Sushila Meena: క్రికెట్ దేవుడుగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్‌కు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు. క్రికెట్ ఆడే ప్రతి చిన్నారికి సచిన్ టెండూల్కర్ గురించి తెలుసు. లిటిల్ మాస్టర్ తన క్రికెట్ కెరీర్‌లో తన ఆటతో చాలా పేరు సంపాదించాడు. అదే సమయంలో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా అతడికి ఆదరణ తగ్గలేదు. నేటికీ అభిమానులు అతని బ్యాటింగ్ శైలిని కాపీ కొట్టి తమ ఆరాధ్యదైవాన్ని అనుసరిస్తుంటారు. సచిన్ క్రికెట్ ప్రపంచంలో తనదైన ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాడు. ఇటీవల కూడా అలాంటిదే కనిపించింది. రాత్రికి రాత్రే ఓ అమ్మాయిని స్టార్‌ని చేసిన సచిన్.. అయితే, ఈ అమ్మాయి షాకింగ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియాలో స్టార్‌గా మారింది.. సచిన్ ఎవరో తెలియదని చెప్పింది..
రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామేర్ తలాబ్ అనే చిన్న గ్రామంలో నివసించే 10 ఏళ్ల సుశీల మీనా ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్. వాస్తవానికి, కొన్ని రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ సుశీల మీనా బౌలింగ్ యాక్షన్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సుశీల చర్యను జహీర్ ఖాన్ లాగే ఉందంటూ టెండూల్కర్ అభివర్ణించాడు. జహీర్ కూడా దీనికి అంగీకరించాడు. ఈ వీడియోను లక్షలాది మంది చూడగా, వేలాది మంది షేర్ చేశారు. అప్పటి నుంచి స్టార్‌గా కూడా మారిపోయింది. ఇప్పుడు ఆమెను అందరూ గుర్తించి రాజకీయ నాయకుల నుంచి సామాజిక కార్యకర్తల వరకు ఆమెను కలిసేందుకు వస్తున్నారు. అయితే, సచిన్ టెండూల్కర్‌ను గుర్తించేందుకు సుశీలా మీనా ఇబ్బంది పడింది.
నిజానికి, సుశీలా మీనా బీబీసీతో మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతూ, ‘ఆయన (సచిన్ టెండూల్కర్) ఎవరో నాకు తెలియదు. అయినప్పటికీ ఆయనకు వారికి కృతజ్ఞతతో ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. సుశీల మీనా కుటుంబానికి టెలివిజన్ లేదు. ఆమె ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ చూడలేదు. ఇదొక్కటే కాదు, ఆమె ఊరి మొత్తంలో ఎవరి ఇంట్లోనూ టీవీ లేదు. తన బౌలింగ్ గురించి సుశీలా మీనా మాట్లాడుతూ, ‘బాల్ నా చేతికి వచ్చిన తర్వాత, నేను బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అంటూ తెలిపింది.
రాజస్థాన్ క్రీడా మంత్రి ఔట్..
बिटिया से क्लीन बोल्ड होकर हम सब जीत गए#राजस्थान #Rajasthan #Sports #Happiness #Cricket pic.twitter.com/VFrezO92GT
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) January 6, 2025
సుశీల లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, తాజాగా సుశీలకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను సుశీల తన బౌలింగ్‌తో బోల్తా కొట్టించిన విషయాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోను రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను షేర్ చేస్తూ, ‘ఈ చిన్నారి చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాం’ అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..