Martin Guptill: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఓపెనర్.. 2019 సెమీ-ఫైనల్‌లో ధోనీని రనౌట్ చేసింది మనోడే

మార్టిన్ గప్టిల్ తన 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు. 2015 ప్రపంచకప్‌లో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 2019 సెమీ-ఫైనల్‌లో ధోనీ రనౌట్ క్షణం చిరస్మరణీయంగా నిలిచింది. గప్టిల్ క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలే పేరు. నేను నా దేశం కోసం పోరాడిన ప్రతి క్షణాన్ని నెమరువేసుకుంటాను," అంటూ గుప్తిల్ భావోద్వేగంగా తన భావనలు పంచుకున్నాడు.

Martin Guptill: రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ ఓపెనర్.. 2019 సెమీ-ఫైనల్‌లో ధోనీని రనౌట్ చేసింది మనోడే
Martin Guptil
Follow us
Narsimha

|

Updated on: Jan 08, 2025 | 7:11 PM

న్యూజిలాండ్ ఓపెనర్ బ్యాట్సమెన్ మార్టిన్ గప్టిల్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. దీనితో ఆయన 14 సంవత్సరాల క్రికెట్ ప్రయాణం ముగిసింది. ఐపీఎల్ 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన గప్టిల్, ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం కొనసాగించనున్నాడు. “న్యూజిలాండ్ తరపున 367 మ్యాచ్‌లు ఆడటమనేది గర్వకారణం. నేను నా దేశం కోసం పోరాడిన ప్రతి క్షణాన్ని నెమరువేసుకుంటాను,” అంటూ గుప్తిల్ భావోద్వేగంగా తన భావనలు పంచుకున్నాడు.

తన అసాధారణ శైలి, పవర్ హిట్టింగ్‌తో గుర్తుండిపోయే గప్టిల్, 2015 వన్డే ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 237 పరుగులతో అజేయంగా నిలిచి, న్యూజిలాండ్ తరపున తొలి డబుల్ సెంచరీ చేసిన ఘనత సాధించాడు. 2019 సెమీ-ఫైనల్‌లో ధోనీని రనౌట్ చేసిన గుప్తిల్ ఆ క్షణం తన దేశాన్ని విజయానికి నడిపించిన ఘనతను మరువలేని గొప్ప యాదృశ్యంగా మలచుకున్నాడు.

మొత్తం 23 అంతర్జాతీయ సెంచరీలతో పాటు వందలాది ఫోర్లు, సిక్సర్లతో ఆకట్టుకున్న గప్టిల్ న్యూజిలాండ్ క్రికెట్‌లో సుదీర్ఘ ముద్ర వేశాడు. క్రికెట్ అభిమానుల హృదయాలలో గుప్తిల్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.