బ్రేకింగ్: భైంసాను కైవసం చేసుకున్న ఎంఐఎం

నిర్మల్‌లోని భైంసా‌ స్థానాన్ని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. ఎంఐఎం-15, బీజేపీ-9, ఇతరులు-2 వార్డుల్లో గెలుపు సాధించారు. కాసేపటి క్రితం బీజేపీ, ఎంఐఎం పార్టీలు రెండూ హోరాహోరీగా తలబడ్డాయి. బీజేపీ పార్టీనే వస్తుందని అందరూ అనుకున్న.. రివర్స్‌గా ఎంఐఎం పార్టీ గెలిచి.. కమలానికి షాక్‌ ఇచ్చింది. కాగా.. ఇటీవల భైంసాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా దళాలు భారీగా మోహరించారు. సుమారు 1000 మందితో పోలీసులు బందోబస్తు మరింత పటిష్టం చేశారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:18 pm, Sat, 25 January 20
బ్రేకింగ్: భైంసాను కైవసం చేసుకున్న ఎంఐఎం

నిర్మల్‌లోని భైంసా‌ స్థానాన్ని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. ఎంఐఎం-15, బీజేపీ-9, ఇతరులు-2 వార్డుల్లో గెలుపు సాధించారు. కాసేపటి క్రితం బీజేపీ, ఎంఐఎం పార్టీలు రెండూ హోరాహోరీగా తలబడ్డాయి. బీజేపీ పార్టీనే వస్తుందని అందరూ అనుకున్న.. రివర్స్‌గా ఎంఐఎం పార్టీ గెలిచి.. కమలానికి షాక్‌ ఇచ్చింది.

కాగా.. ఇటీవల భైంసాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా దళాలు భారీగా మోహరించారు. సుమారు 1000 మందితో పోలీసులు బందోబస్తు మరింత పటిష్టం చేశారు. పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్, కర్ఫ్యూ ఎత్తివేసినా పట్టణంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.