బ్రేకింగ్: ఓడిన అభ్యర్థులను గదిలో బంధించిన పోలీసులు

ఓడిన అభ్యర్థులను గదిలో బంధించారు పోలీసులు. ఈ ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్‌లో ఓడిన అభ్యర్థుల్ని.. పోలీసులు ఓ రూమ్‌లో వేసి తాళాలు వేయడం కలకలం రేపుతోంది. ఓడి పోయిన వారంతా బయటకు వెళ్తే.. గొడవలు చెలరేగే అవకాశం ఉందన్న ముందుచూపుతో ఇలా చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే కావాలనే.. పోలీసులచే ఇలా అధికార పార్టీ చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. కాగా.. సిరిసిల్లలో టీఆర్ఎస్ పార్టీ 24, కాంగ్రెస్ 02, బీజేపీ 03, […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:54 pm, Sat, 25 January 20
బ్రేకింగ్: ఓడిన అభ్యర్థులను గదిలో బంధించిన పోలీసులు

ఓడిన అభ్యర్థులను గదిలో బంధించారు పోలీసులు. ఈ ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్‌లో ఓడిన అభ్యర్థుల్ని.. పోలీసులు ఓ రూమ్‌లో వేసి తాళాలు వేయడం కలకలం రేపుతోంది. ఓడి పోయిన వారంతా బయటకు వెళ్తే.. గొడవలు చెలరేగే అవకాశం ఉందన్న ముందుచూపుతో ఇలా చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే కావాలనే.. పోలీసులచే ఇలా అధికార పార్టీ చేయిస్తోందని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.

కాగా.. సిరిసిల్లలో టీఆర్ఎస్ పార్టీ 24, కాంగ్రెస్ 02, బీజేపీ 03, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఓడిపోయిన అభ్యర్థులు కౌంటింగ్ బూత్ వద్ద నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన అభ్యర్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో.. ఓడిన అభ్యర్థులను గదిలో బంధించారు పోలీసులు.