ధైర్యమే బలం: కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో వేగం పెరిగింది. అయితే వ్యాక్సిన్ మాట అటుంచితే

ధైర్యమే బలం: కరోనాను జయించిన 103 ఏళ్ల వృద్ధుడు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 18, 2020 | 6:24 PM

Telangana Corona Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో వేగం పెరిగింది. అయితే వ్యాక్సిన్ మాట అటుంచితే, అన్ని దేశాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను కలిగిస్తోంది. మానసిక ధైర్యంతో, తగిన జాగ్రత్తలు తీసుకొని కరోనాను జయిస్తున్నారు చాలా మంది. ఇందులో వృద్ధులు కూడా ఉన్నారు. ఇక తెలంగాణలో 103 ఏళ్ల కురువృద్ధుడు కరోనాను జయించారు.

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో పరచూరి రామస్వామి అనే వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆయనను తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌(టిమ్స్‌)లో చేర్పించారు. వైద్యుల చికిత్సకు తోడు మనోధైర్యంతో పరచూరి రామస్వామి కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనాను జయించిన కురవృద్ధుడు ఆయన కావడం విశేషం.

Read more:

కీర్తిని వద్దనుకుంటోన్న మహేష్‌ టీమ్‌.. కారణమిదేనా..!

‘ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌’లో భారీ స్కాం‌.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: హరి ప్రసాద్

Latest Articles