‘ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌’లో భారీ స్కాం‌.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: హరి ప్రసాద్

టీటీడీ ప్రభుత్వానికి ఐటీ సలహదారుగా పనిచేసిన వేమూరి హరిప్రసాద్ అప్పట్లో ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో భారీ స్కాం‌ చేశారని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని

'ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌'లో భారీ స్కాం‌.. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి: హరి ప్రసాద్
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2020 | 1:59 PM

AP Fiber Grid scam: టీటీడీ ప్రభుత్వానికి ఐటీ సలహదారుగా పనిచేసిన వేమూరి హరిప్రసాద్ అప్పట్లో ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో భారీ స్కాం‌ చేశారని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఏపీ ఫైబర్ గ్రిడ్ గౌరీ శంకర్ అన్నారు. 300 కోట్ల రూపాయల టెండర్‌ని ‘తెర’ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి లింక్ ఇచ్చారని.. హరి ప్రసాద్ తనను పలుమార్లు బెదిరించారని ఆరోపణలు చేశారు. టెండర్‌కి సహకరించకపోతే  బిజినెస్ ఎలా నడుపుతావో చూస్తా అంటూ బెదిరించారని గౌరీ శంకర్ ఆరోపించారు. ఫేక్ సర్టిఫికేట్లతో హరిప్రసాద్ టెండర్‌ని స్వాధీనం చేసుకున్నారని, పవన్ తుమ్మల ‘తెర’ కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరించారని గౌరీ శంకర్ తెలిపారు.

ఇక ఈ స్కాంలో హరిప్రసాద్‌తో పాటు ఆయన అక్క కూడా కీలకపాత్ర పోషించిందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌  మానిటోరింగ్‌కి చెన్నైలోని జెమినీకి కేటాయించారని, హరి ప్రసాద్ నెట్ ఇండియా కంపెనీకి డైరెక్టర్ కూడా అని పేర్కొన్నారు. ఫైబర్ నెట్ కనెక్షన్స్‌లో క్వాలిటీ కేబుళ్లను ఉపయోగించలేదని గౌరీ శంకర్ చెప్పుకొచ్చారు. కిలో మీటర్ ఫైబర్ వేయడానికి 15,000 లోపు ఖర్చు అవుతుందని, అలాంటిది హరిప్రసాద్‌ మాత్రం అర కిలోమీటర్‌కి 45వేల రూపాయలు ఖర్చుచేశారని తెలిపారు. ఇక ఫైబర్ పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆడిటింగ్ నిర్వహించలేదని గౌరీ శంకర్ ఆరోపించారు. నేటప్స్ కంపెనీకి 150 కోట్ల ఫైబర్ సర్వీస్ పేరిట హరి ప్రసాద్ స్వాహా చేశారని అన్నారు. ఆ కంపెనీకి హరి ప్రసాద్ కుమార్తె అభిఙ్ఞ సీఈవోగా వ్యవహరించారని అన్నారు. ఇప్పటికి రాష్ట్రంలో 12 లక్షల కనెక్షన్ బాక్స్‌లు ఉండాలని, కానీ 8 లక్షలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.

ఫైబర్ కనెక్షన్ ప్రాజెక్ట్‌లో 85 శాతం వేమూరి కుటుంబానికే దక్కాయని.. గత ప్రభుత్వంతో కలిసి వారు కోట్లు స్వాహా చేశారని అన్నారు. హరి ప్రసాద్ తెలివిగా గేమ్ ఆడుతున్నారని, గతంలో కూడా అదే పని చేశారని పేర్కొన్నారు. నెట్ ఇండియాలో ఉద్యోగి అయిన వల్లభనేని చౌదరి కూడా హరి ప్రసాద్‌ మనిషని, థర్డ్ పార్టీ టెండర్లు కూడా హరి ప్రసాద్ సంబంధించిన కంపెనీలకే కేటాయించారని గౌరీ శంకర్ చెప్పుకొచ్చారు.

Read More:

వీడిన ‘నిశ్శబ్దం’.. రిలీజ్ డేట్ చెప్పేసిన టీమ్‌

Bigg Boss 4: గంగవ్వ అభ్యర్థన.. డైలమాలో అభిమానులు