New Year Celebrations: అరకులో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. రేవ్ పార్టీలపై ప్రత్యేక నిఘా
New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలకు మరికొన్ని గంటలే సమయం ఉంది. వేడుకలు చేసుకునేందుకు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరు రెడీ అవుతున్నారు...
New Year Celebrations: న్యూ ఇయర్ వేడుకలకు మరికొన్ని గంటలే సమయం ఉంది. వేడుకలు చేసుకునేందుకు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరు రెడీ అవుతున్నారు. ఇక కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కొత్త సంవత్సరం వేడుకలపై నీళ్లు చల్లుతోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇక అరకులో నిర్వహించే వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాలలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇప్పటికే అరకుకు భారీ ఎత్తున పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. న్యూ ఇయర్ వేడుకల కోసం రిసార్ట్స్, హోటళ్లలలో హౌస్ ఫుల్ అయిపోయింది. ఇప్పటి నుంచి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు. ఇక ఈ వేడుకల సందర్భంగా రేవ్ పార్టీల నిర్వహణ, గంజాయి వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పర్యాటక ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఉపేక్షించేదిలేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు.
ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అరకు సహా పర్యాటక ప్రాంతాలపై నిఘా పెంచుతున్నాం.. అదనపు బలగాలతో పహారా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే హైస్పీడ్ రైడింగ్, బహిరంగ మద్యం, జూదంపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గంజాయి వినియోగం, రేవ్ పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హోటల్స్, రిసార్ట్స్, జీప్ యజమానులకు ప్రత్యేక సూచనలు ఇచ్చామని పాడేరు ఏఎస్పీ జగదీష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: