Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Party: న్యూ ఇయర్ పార్టీలు చేసుకుంటున్నారా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కండీషన్స్ ఏంటో తెలుసుకోండి

డిసెంబర్ 31 తర్వాత ఇంగ్లీష్ క్యాలెండర్ ఎండ్ అవడం.. జనవరి 1తో కొత్త సంవత్సరం రావడం ప్రతి సారీ కామనే.. కానీ ప్రతిఏడాదీ చేసుకునే పార్టీలు మాత్రం కామన్ కాదు.

New Year Party: న్యూ ఇయర్ పార్టీలు చేసుకుంటున్నారా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కండీషన్స్ ఏంటో తెలుసుకోండి
New Year 2021
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 31, 2021 | 8:51 AM

డిసెంబర్ 31 తర్వాత ఇంగ్లీష్ క్యాలెండర్ ఎండ్ అవడం.. జనవరి 1తో కొత్త సంవత్సరం రావడం ప్రతి సారీ కామనే.. కానీ ప్రతిఏడాదీ చేసుకునే పార్టీలు మాత్రం కామన్ కాదు. ప్రతీ ఇయర్ డిఫరెంట్‌గా ప్లానింగ్‌తో పార్టీలు షురూ చేస్తుంది కుర్రకారు. కానీ.. రెండు సంవత్సరాలుగా పరిస్థితి తారుమారైంది. కరోనా దెబ్బకు అందరూ సైలెంట్ అవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం వేడుకలకు పర్మిషన్ ఇచ్చాయి టూ.. తెలుగు స్టేట్స్. బట్… కండిషన్స్ అప్లై.

అవును.. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ సిద్ధమైంది. జోష్‌ కోసం ఎదురుచూస్తున్న యువతను.. యు ఆర్ అటెన్షన్ ప్లీజ్ అంటున్నారు పోలీసులు. ఆల్కహాల్‌కు తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి వరకు అనుమతి ఇచ్చిందని, ఫుల్‌ గా తాగి రోడ్డెక్కారో.. తాట తీస్తామంటున్నారు. న్యూ ఇయర్ వేళ నకరాలు చేస్తే.. జైలు ఊచలు లెక్కపెట్టిస్తామని హెచ్చరిస్తున్నారు.

మద్యం సేవించి పట్టుబడితే 10 వేలు రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. లేదంటే 6 నెలల జైలుశిక్ష ఉంటుంది. రెండోసారి పట్టుబడితే 15 వేల రూపాయల జరిమానా లేదంటే రెండేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాలి. ఏకంగా డ్రైవింగ్‌ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. హైదరాబాద్ వంటి నగరాల్లో రేపు రాత్రి 11 నుంచి ఉదయం తెల్లవారే వరకు ఫ్లైఓవర్లపై రాకపోకలు బంద్.

ఇష్టం వచ్చినట్టు ఈవెంట్స్ పెట్టకుండా.. పబ్‌లు, బార్లకు కూడా ముకుతాడు వేసింది కోర్ట్. డీజేలకు నో పర్మిషన్. సో.. పబ్బుల నుంచి శబ్ద కాలుష్యం 45 డెసిబుల్స్‌కు మించొద్దని చెప్పింది కోర్టు. పబ్బుల వద్ద తాగి వాహనం నడుపొద్దని సూచించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది.

తాగి వాహనం నడిపితే పబ్బు నిర్వాహకులే బాధ్యత వహించాలని హెచ్చరించింది. పబ్బులకు వెళ్లే జంటలతోపాటు మైనర్లను పబ్బులోపలికి అనుమితించొద్దని ఆదేశించింది. తాగిన వాళ్లకు డ్రైవర్లను అరేంజ్ చేయాల్సిన బాధ్యత పబ్‌లదే అని స్పష్టం చేసింది కోర్ట్. కానీ వందలాది మందికి డ్రైవర్లను అరేంజ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

కోవిడ్ నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2 వరకు నిషేధిస్తూ అన్ని జిల్లాలకు ఆంక్షలు పంపామన్న డీజీపీ మహేందర్ రెడ్డి అమలుచేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదే అని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలో భాగంగా ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామన్నారు.

పార్టీలకు వెళ్లి తాగి.. తూగే వాళ్ల కోసం ఆర్టీసీ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈవెంట్ దగ్గరకు తీసుకెళ్లి.. తిరిగి ఇంటి దగ్గరకు సేఫ్టీగా తీసుకొస్తామని చెప్తోంది. మనిషికి 200 రూపాయలు చెల్లిస్తే చాలు.ఇవాళ రాత్రి 7.30 నుంచి 9.30 వరకు.. పిక్ అప్ చేసుకుని.. డెస్టినేషన్‌కు తీసుకెళ్తాయి. అర్ధరాత్రి 12.30 నుంచి 3 గంటల వరకు తిరిగి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ. 15 రూట్లలో ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా 18 సీట్ల కెపాసిటీ ఉన్న వజ్ర బస్‌ను నాలుగు వేలకే బుక్ చేసుకోవచ్చని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

…………………………………………….

ఏపీలోనూ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇక్కడ కూడా సెక్షన్ 30, సెక్షన్ 144 సీఆర్‌పీసీ అమలులో ఉంది. అర్ధరాత్రి ఆరుబయట వేడుకలకు అనుమతి లేదు. క్లబ్బులు ఈవెంట్లు నిర్వహించుకోవాలంటే.. ముందస్తు పర్మిషన్ కావాలి. డీజేలు, సౌండ్ సిస్టంలకు అనుమతి లేదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా.

విజయవాడలో బందరు రోడ్, ఏలూరు రోడ్, బిఆర్టిఎస్. రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్, పి.సి.ఆర్. ఫ్లై ఓవర్ లపై ట్రాఫిక్ అనుమతిలేదు.ఇటు విశాఖలోనూ స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తున్నారు. యారాడ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్‌ను సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్టు తెలిపారు అధికారులు. ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్‌లపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని సీపీ మనీష్ కుమార్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇన్ని కండీషన్స్ మధ్య ఈ సారి వేడుకలు ఎలా ఉంటాయనే సస్పెన్స్.. కిక్కిస్తోంది. రూల్స్ పాటిస్తూ.. ఇంటి దగ్గరే పార్టీ చేసుకుంటారా.. లేదంటే.. ఇంకేమైనా ప్లాన్స్ చేస్తారా….?

Also Read: కొత్తగా వాహనాలు కొన్నవారికి ఊరటనిచ్చే న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

Telugu Heroine: బుర్ఖాలో థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తించారా..?