Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Disha Police Station: ఏపీ సర్కార్ సహా.. దిశ పోలీస్ స్టేషన్ల పని తీరు అద్భుతం అంటూ పార్లమెంట్‌ కమిటీ ప్రశంసలు..

Disha Police Station: ఆంధ్రప్రదేశ్ లో దిశ పోలీసు స్టేషన్ ల పనితీరు అద్భుతంగా ఉందంటూ పార్లమెంట్‌ మహిళా భద్రత, సాధికారిత కమిటీ ప్రశంసల వర్షం కురిపించింది.  విశాఖలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను..

Disha Police Station: ఏపీ సర్కార్ సహా.. దిశ పోలీస్ స్టేషన్ల పని తీరు అద్భుతం అంటూ పార్లమెంట్‌ కమిటీ ప్రశంసలు..
Disha Police Station
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2021 | 7:14 PM

Disha Police Station: ఆంధ్రప్రదేశ్ లో దిశ పోలీసు స్టేషన్ ల పనితీరు అద్భుతంగా ఉందంటూ పార్లమెంట్‌ మహిళా భద్రత, సాధికారిత కమిటీ ప్రశంసల వర్షం కురిపించింది.  విశాఖలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను పార్లమెంట్‌ కమిటీ శనివారం సందర్శించింది. డాక్టర్ హీనా విజయ్ కుమార్ గావిట్ అధ్యక్షతన ఏడుమంది తో కూడిన బృందం ఒక రోజు పర్యటన చేసింది. ఈ కమిటీకి దిశ పీఎస్‌ పనితీరును దిశ స్పెషల్‌ అధికారి డీఐజీ రాజకుమారి, సీపీ మనీష్‌కుమార్‌ వివరించారు. ఈ సందర్భంగా ఏపీలోని దిశ పోలీస్‌స్టేషన్‌ పనితీరు అద్భుతమని పార్లమెంట్‌ కమిటీ ప్రశంసించింది. మహిళా సాధికారతకు అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా మహిళల అభ్యున్నతికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది.. చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తుంది.

ఈ సందర్భంగా డాక్టర్ హీనా విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తనకు సంతోషంగా ఉందని.. మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎపి పోలీస్ చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ సంబంధిత అంకురార్పణ కార్యక్రమాలు చాలా ఆనందాన్ని కలిగించాయని అన్నారు. ఇక దిశ పోలీస్ స్టేషన్ ల ద్వారా మహిళలకు ఎన్నో సౌకర్యాలతో కూడిన సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీస్ శాఖ అందిస్తుంది. దిశా పోలీస్ స్టేషన్లకు అనుసంధానంగా ఏర్పాటుచేసిన క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వాహనం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు హీనా. అంతేకాదు తాను ఒక వైద్యురాలిగా కచ్చితంగా చెప్పగలను.. కేసులో బాధితురాలికి సంబంధించిన శాంపిల్ ని కలెక్ట్ చేయడం ఎంత కష్టతరమైనదో అని అన్నారు.

దిశ చట్టం లో పొందుపరిచిన ఇరవై ఒక్క రోజుల్లోనే నేరస్తుడికి శిక్ష అనేది ఒక చక్కటి అంశమని.. దీనిపై పార్లమెంట్ కమిటీ తరఫున కేంద్రానికి నివేదికను అందజేసి ఆమోదం పోడేందుకు తమ కృషి చేస్తామని ఈ బృదం తెలిపింది.  ఇటువంటి మహత్తర కార్యక్రమాలు అందరూ కలిసి కట్టుగా పని చేస్తేనే విజయవంతంగా ప్రజలకు చేరుతాయని ..అది ఇక్కడి అధికారుల్లో తనకు స్పష్టంగా కనిపించిందన్నారు.  ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మా కమిటీ తరఫున అభినందిస్తున్నాను..  ప్రతి ఇరవై ఇళ్లకు ఒక మహిళా పోలీస్ ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని జగన్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ తీసుకుంటున్న ఈ రకమైన కార్యక్రమాలు నేను ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఇటువంటి కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మహిళల రక్షణ, భద్రత తో పాటు వారి సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను మరోసారి అభినందిస్తున్నానని అన్నారు.

Also Read: Age and Fertility: జీతం, జీవితం, ఎంజాయ్ అంటూ 37 ఏళ్ళు దాటినా ప్రెగ్నెన్సీ వాయిదా వేస్తున్న మగువలూ.. ఇది మీకోసమే..