Age and Fertility: జీతం, జీవితం, ఎంజాయ్ అంటూ 37 ఏళ్ళు దాటినా ప్రెగ్నెన్సీ వాయిదా వేస్తున్న మగువలూ.. ఇది మీకోసమే..
Age and Fertility: అమ్మదనంలోని కమ్మదనం అనుభవించాలని.. పెళ్ళైన ఏడాదికే పండంటి బిడ్డను కని పెంచే రోజుల నుంచి .. ఆధునికత పేరుతో వచ్చిన మార్పుల్లో భాగంగా మహిళల జీవితంలో ముఖ్యఘట్టమైన..
Age and Fertility: అమ్మదనంలోని కమ్మదనం అనుభవించాలని.. పెళ్ళైన ఏడాదికే పండంటి బిడ్డను కని పెంచే రోజుల నుంచి .. ఆధునికత పేరుతో వచ్చిన మార్పుల్లో భాగంగా మహిళల జీవితంలో ముఖ్యఘట్టమైన మాతృత్వాన్ని కూడా పక్కకు పెట్టేస్తున్నారు. ఉరుకుల, పరుగుల జీవితం, భారీగా జీతం.. ప్రశాంతతకు కరువైన కాలం.. దీంతో మదర్ హుడ్ అనే అద్భుతమైన అనుభూతిని మగువలు వాయిదా వస్తున్నారు. కొందరు జీవన శైలి వచ్చిన మార్పులతో పాటు ఇతర సమస్యలతో మాతృత్వానికి దూరం అయితే.. మరికొందరు అప్పుడే పిల్లలు వద్దు అంటూ ఉద్దేశ్యపూర్వకంగా వాయిదా వేస్తున్నారు.
ఇప్పటి జంటలకు పిల్లలు పుట్టడం అనేది గగనంగా మారిపోయింది. దీనికోసం డాక్టర్లను సంప్రదిస్తూ లక్షలు ఖర్చు చేసుకుంటున్నాయి నేటి జంటలు. అయిన ఫలితం మాత్రం కనిపించడం లేదు. గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో ఈ సంతన లేమి సమస్యలు శాతం ఘననీయంగా పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదని లెక్కలు చెబుతున్నారు. అంతేకాదు కొత్త మంది జంటలు పెళ్ళైన వెంటనే పిల్లలని కనడానికి ఇష్టపడడంలేదు. ఇప్పుడే పెళ్లైంది కొంతకాలం అయినా జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటూ పిల్లలు కనడాన్ని వాయిదా వేస్తున్నారు.
కొంతమంది అమ్మాయిలు చదువు ఉద్యోగం తగిన వరుడు అంటూ లేటు వయసులో పెళ్లి చేసుకుంటే.. మరికొందరు 20 ఏళ్ల వయసు దాటిన వెంటనే పెళ్లి చేసుకుంటున్నారు. అయినప్పటికీ 35 ఏళ్లొచ్చినంత వరకు తల్లులు కాని మగువలు ఎందరో ఉన్నారు. అయితే మహిళలు 37 ఏళ్ల కంటే ముందే గర్భం ధరించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 37 సంవత్సరాలు దాటితే మహిళల్లో ప్రెగ్నేన్సీ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయని ప్రముఖ ఫెర్టిలిటీ ఎక్స్‌పెర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
37 ఏళ్ల వయసులో కూడా అండాశయంలో అనేక అండాలు ఉన్నప్పటికీ వాటిలో క్వాలిటీ తగ్గుతుందని వారు వివరించారు. ఇక 37 ఏళ్లు దాటాకా ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అందుకనే మన పెద్దలు ఏ వయసుకు ఆ ముచ్చట అన్నారు పెద్దలు.. 21 ఏళ్లు వయసులో బిడ్డకు జన్మనిస్తే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అదే 30 ఏళ్ల వయసు తర్వాత వచ్చే గర్భాలలో ప్రతి ఐదింటిలో ఒకటి విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంటుందట. ఇక 40 ఏళ్ల తర్వాత గర్భం అబార్షన్లు అయ్యే ప్రమాదాలున్నాయట. ఈ వయసులో జన్మినిస్తే.. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టే అవకాశాలు కూడా తక్కువట. 40 ఏళ్ల దాటినవాల్లైతే “ఐవీఎఫ్” పద్ధతిలో గర్భం దాల్చడం ఉత్తమమని చెబుతున్నారు. అయితే మీకు పిల్లలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లేదంటే మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉండదని.. ఒకవేళ పుట్టినా మానసికంగా, శారీరకంగా బలహీనులు ఉండి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయని పరిశోధనలో తేలింది
ఈ విషయంలో చైనా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దాదాపు 30 ఏళ్ల డేటా ఆధారంగా 3.40 లక్షల మందిపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. పురుషులు.. తమ భార్య గర్భం ధరించడానికి 6 నెలల ముందు నుండే అల్కహాల్ తీసుకోవడం మానేయాలని సూచిస్తున్నారు. అల్కహాల్ తీసుకోవడం కొనసాగిస్తే పుట్టబోయే పిల్లలు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంతో ఉండరని..పుట్టుకతో వచ్చే గుండే జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పిల్లలు కావాలనుకునే దంపతులు ఖచ్చితంగా ఆ ఏడాది పాటు మద్యానికి దూరంగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఏ దేశానికైనా నేటి బాలలే రేపటి పౌరులు.. మరి ఈరోజు పిల్లలు లేకపోతె.. రేపు ఆ దేశ భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నార్ధకమే.. అందుకనే వృద్ధదేశంగా మారుతున్నా చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలు పిల్లలు కనమని ప్రజలకు సరికొత్త ఆఫర్స్ ను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఆ ఊర్లో డెత్ మిస్టరీ.. ఇప్పటికీ కనిపెట్టలేని మిస్టరీనే…500 ఏళ్ల నుంచి జంటమరణాలు ఆనవాయితీ..