మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

అనంతపురం: అనంతపురం నగరపాలకసంస్థలో అదనపు కమిషనర్‌గా ఉన్న శేషన్న నరసరావుపేటకు బదిలీ అయ్యారు. నరసరావు పేట నుంచి అనంత అదనపు కమిషనర్‌గా భానుప్రతాప్‌ నియమితులయ్యారు. హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌గా అబ్దుల్‌ రషీద్‌ నియమితులయ్యారు. గుంతకల్లు అదనపు డైరెక్టరుగా ఉన్న రమణారెడ్డి ప్రొద్దుటూరు కమిషనర్‌గా నియమితులయ్యారు. పొద్దుటూరు కమిషనర్‌గా ఉన్న చంద్రమౌళీశ్వరరెడ్డి ధర్మవరం కమిషనర్‌గా నియమితులయ్యారు. ధర్మవరం కమిషనర్‌ కన్యాకుమారి గుంతకల్లు కమిషనర్‌గా నియమించారు. తాడిపత్రి కమిషనర్‌గా ఉన్న శివరామకృష్ణ చిలకలూరిపేటకు బదిలీ అయ్యారు. బద్వేలు కమిషనర్‌గా ఉన్న […]

మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

అనంతపురం:

అనంతపురం నగరపాలకసంస్థలో అదనపు కమిషనర్‌గా ఉన్న శేషన్న నరసరావుపేటకు బదిలీ అయ్యారు. నరసరావు పేట నుంచి అనంత అదనపు కమిషనర్‌గా భానుప్రతాప్‌ నియమితులయ్యారు. హిందూపురం మున్సిపల్‌ కమిషనర్‌గా అబ్దుల్‌ రషీద్‌ నియమితులయ్యారు. గుంతకల్లు అదనపు డైరెక్టరుగా ఉన్న రమణారెడ్డి ప్రొద్దుటూరు కమిషనర్‌గా నియమితులయ్యారు. పొద్దుటూరు కమిషనర్‌గా ఉన్న చంద్రమౌళీశ్వరరెడ్డి ధర్మవరం కమిషనర్‌గా నియమితులయ్యారు. ధర్మవరం కమిషనర్‌ కన్యాకుమారి గుంతకల్లు కమిషనర్‌గా నియమించారు. తాడిపత్రి కమిషనర్‌గా ఉన్న శివరామకృష్ణ చిలకలూరిపేటకు బదిలీ అయ్యారు. బద్వేలు కమిషనర్‌గా ఉన్న నరసింహప్రసాద్‌ను తాడిపత్రికి బదిలీ చేశారు. పుట్టపర్తి కమిషనర్‌గా ఉన్న షమి పిడుగురాళ్లకు బదిలీ అయ్యారు. పుట్టపర్తి కమిషనర్‌గా రమణారెడ్డి నియమితులయ్యారు. మున్సిపల్‌ ఆర్డీ కార్యాలయంలో ఏడీగా ఉన్న రాజు డోన్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. వెయింటింగ్‌లో ఉన్న చెన్నడుకి గుంతకల్లు సహాయ కమిషనర్‌గా నియమించారు. నగరపాలకసంస్థలో కార్యదర్శిగా ఉన్న జ్యోతిలక్ష్మి తెనాలి కమిషనర్‌గా బదిలీ అయ్యారు. అహుడాలో డీపీఓగా ఉన్న పగడాల కృష్ణమూర్తిని అనంత నగరపాలకసంస్థ కార్యదర్శిగా నియమితులయ్యారు. గుత్తి కమిషనర్‌గా ఉన్న గంగిరెడ్డిని నందికొట్కూరుకు బదిలీ చేశారు. నందికొట్కూరులో ఉన్న రవికుమార్‌ ధర్మవరం అసిస్టెంట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.

Published On - 5:34 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu