AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: విశాఖకు చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ నౌక క్రూయిజ్ “ది వరల్డ్”

విశాఖలో నిర్మితమైన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‎కు మంచి ఆదరణ పొందింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్యంలోని క్రూయిజ్ "ది వరల్డ్" ఈరోజు లంగరు వేసుకుంది. విశాఖ పోర్ట్ సిటీ ఇదే మొదటి ప్రయాణం. ఏప్రిల్ 28 నుంచి రెండు రోజుల పాటు ఇది విశాఖ లోనే ఉండనుంది. భూలోక స్వర్గాన్ని తలపించే ఈ అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ అంటార్కిటికాతో సహా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, అమెరికా ఖండాలలో పర్యటించనుంది.

Watch Video: విశాఖకు చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ నౌక క్రూయిజ్ ది వరల్డ్
The World
Eswar Chennupalli
| Edited By: Srikar T|

Updated on: Apr 28, 2024 | 6:43 PM

Share

విశాఖలో నిర్మితమైన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‎కు మంచి ఆదరణ పొందింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ యాజమాన్యంలోని క్రూయిజ్ “ది వరల్డ్” ఈరోజు లంగరు వేసుకుంది. విశాఖ పోర్ట్ సిటీ ఇదే మొదటి ప్రయాణం. ఏప్రిల్ 28 నుంచి రెండు రోజుల పాటు ఇది విశాఖ లోనే ఉండనుంది. భూలోక స్వర్గాన్ని తలపించే ఈ అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ అంటార్కిటికాతో సహా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, అమెరికా ఖండాలలో పర్యటించనుంది. 2024 ప్రపంచయాత్రలో భాగంగా ఈ ప్రైవేటు క్రూజ్‎లో 80 మంది వివిధ దేశాల టూరిస్ట్‎లు ఇందులో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా విశాఖలో వివిధ పర్యాటక ప్రాంతాలను సందరిస్తున్నారు. ఇలా ప్రపంచస్థాయి టూరిస్ట్‎లతో క్రూయిజ్ రావడంతో విశాఖ పోర్ట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిది.

“ది వరల్డ్” ది ఘనమైన నేపథ్యం..

2002లో ప్రారంభించబడిన ది వరల్డ్ క్రూయిజ్‎లో 167 అత్యంత విలాసవంతమైన నివాస గదులను కలిగి ఉంటుంది. ఇది ఇప్పటివరకు 120 కంటే ఎక్కువ దేశాలలో పర్యటించి 1,000కి పైగా పోర్ట్‌లను సందర్శించింది. ఈ క్రూయిజ్ యాజమాన్య బృందం కూడా 20 దేశాలకు చెందిన విభిన్న సమూహ యాజమాన్య పరిధిని కలిగి ఉంది. ది వరల్డ్‎లో పర్యటించేవారు దాదాపు అందులో నివాసం ఉంటున్న వాళ్ళుగానే చూడల్సి ఉంటుంది. ఎందుకంటే వివిధ దేశాల సంస్కృతులు, అలవాట్ల మధ్య కాలం గడపాల్సి ఉంటుంది.

సముద్రంలో తేలియాడే నగరం క్రూయిజ్..

సముద్రంలోనే ఉండే ఈ కమ్యూనిటీని ప్రతి రెండు-మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా పర్యటించేందుకు వీలుగా టూర్ ఉంటుంది. నిరంతర ప్రపంచవ్యాప్త ప్రయాణంలో ఉండే ఈ క్రూజ్ సముద్రంలో తేలియాడే నగరం‎గా చెబుతున్నారు పర్యాటకులు. అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన గదులు టూరిస్ట్‎లకు అత్యంత సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

విశాఖలో పర్యటించే ప్రాంతాలు ఇవే..

విశాఖపట్నంలో రెండు రోజుల స్టాప్‌ఓవర్‌లో ఈ ప్రపంచ యాత్రికులు బౌద్ధ ప్రదేశాలతో సహా నగరంలోని కొన్ని ప్రముఖ పర్యాటక క్షేత్రాలను సందర్శిస్తారు. దీంతో పాటు ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని అధ్యయనం చేస్తారు. ఓడలోని నివాసితుల కోసం భరతనాట్యం, కూచిపూడి సాంస్కృతిక ప్రదర్శన కూడా ప్లాన్ చేశారు నిర్వాహకులు.

తిరుగు ప్రయాణం ఇలా..

ఈ నౌక ఆదివారం ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నం ఓడరేవులోకి ప్రవేశించింది. జనవరిలో అంటార్కిటికా, ఫాక్లాండ్ దీవులకు యాత్ర ప్రారంభించి డెస్టినీ సిటీకి ప్రస్తుతం చేరుకుంది. దక్షిణ అమెరికా తర్వాత వారు బ్యూనస్ ఎయిర్స్, రియో డి జనీరో, అగ్నిపర్వత దీవులను సందర్శించారు. విశాఖపట్నం నుండి సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాం వైపు వెళ్లే ముందు ది వరల్డ్ పోర్ట్ బ్లెయిర్‌కు రేపు బయలుదేరుతుంది.

పూర్తి వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..