Watch Video: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌పై సామాన్యుడు పోటీ.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చారంటే..
పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుతుంది. అలాగే ఈ ఎన్నికల్లో జరిగే ప్రతి విషయంపై ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌పై చెప్పులు కుట్టే వ్యక్తి పోటీ చేయడం పిఠాపురం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోవటంతో.. ఈసారి ఎలాంటి తప్పులు జరగకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుతుంది. అలాగే ఈ ఎన్నికల్లో జరిగే ప్రతి విషయంపై ఆసక్తి కరమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌పై చెప్పులు కుట్టే వ్యక్తి పోటీ చేయడం పిఠాపురం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోవటంతో.. ఈసారి ఎలాంటి తప్పులు జరగకూడదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అందుకే ఒకేచోట పోటీ చేయాలని భావించారు. చాలా రోజుల ఎదురుచూసిన తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే పిఠాపురం పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఏడిద భాస్కరరావు అనే చెప్పులు కుట్టుకునే సామాన్య వ్యక్తి పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఏడిద భాస్కరరావు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. భాస్కరరావు కుటుంబం పిఠాపురం సీతయ్యగారితోటలో నివశిస్తోంది.
అయితే ఇక్కడ చెప్పులు కుడుతూ కనిపిస్తున్న భాస్కర్ రావు డిగ్రీ వరకు చదివాడు. స్థానిక ప్రభుత్వ కాలేజీ వద్ద చెప్పులు కుట్టకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకవైపు చెప్పులు కూడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు తన చదువు కొనసాగించారు. అలా బి.ఏ రాజనీతిశాస్త్రం అధ్యయనం చేశారు. చిన్నతనంలోనే తన తండ్రి ఏడిద నాగేశ్వరరావు పిఠాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికల్లో అనేకసార్లు పోటీ చేశారు. చిన్న తనం నుంచి తండ్రితో పాటు తిరిగిన భాస్కరరావు కూడా రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అందులో భాగంగానే నాలుగైదు కౌన్సిలర్ ఎన్నికల్లో కార్యకర్తగా పనిచేశారు.
చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా పని చేయడాన్ని ఆదర్శంగా తీసుకున్నాడు. దాంతో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొత్తం తెలుసుకున్నాడు. స్థానికుడిగా నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ స్వతంత్ర అభ్యర్థిగా గురువారం ఏడిద భాస్కరరావు నామినేషన్ దాఖలు చేశాడు. ఇతడి అభర్థితత్వాన్ని 10 మంది ప్రతిపాదించారు. ఇతడు స్థానిక సీతయ్యగారితోటలో నివాసం ఉంటాడు. ప్రజాస్వామ్య దేశంలో పోటీ చేయాలంటే ఓటు హక్కు కలిగి ఉంటే చాలూ అనే సిద్ధాంతాన్ని నమ్మి పోటీకి సై అంటున్నాడు. నియోజకవర్గంలోని సమస్యలు ఏంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారం ఏ విధంగా చేయాలనే ఉద్దేశ్యంతో మేనిఫెస్టో ఆయన పుస్తకంలో రూపొందిచాడు.
పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలు అనుభవించే వాడిలో తానొక్కడిని, శ్రమని నమ్ముకున్నానని, తనకు ఓటు వేయడం కరెక్టో కాదో ఆలోచించి ఓటు వేయండని చెప్పారు. ప్రస్తుతం పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓ మూలకు కూడా తాను సరిపోనని తనకు తెలుసంటున్నారు. కాకపోతే పిఠాపురాన్ని అభివృద్ధి చేయాలనేది తన దృఢ సంకల్పం అంటున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం యావత్ ప్రజానీకానికి ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌పై ఒక ట్రాన్స్ జెండర్ మహిళతోపాటు.. సామాన్య చెప్పులు కుట్టుకునే భాస్కర్ రావు కూడా పోటీ పడడంతో అందరూ చూపు ఇప్పుడు పిఠాపురం వైపే మళ్లింది.
పూర్తి వీడియో..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..