AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heatwave: డేంజర్‌.. డేంజర్‌..! బయటకు రాకుండా ఉంటేనే బెటర్.. తెలంగాణ, ఏపీలో హీట్‌వేవ్ వార్నింగ్‌

డేంజర్‌.. డేంజర్‌..! మీరు ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్!. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టకండి. ఎందుకంటే, తెలుగురాష్ట్రాలకు రెడ్ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణశాఖ. మరో 3 రోజులపాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి.

Heatwave: డేంజర్‌.. డేంజర్‌..! బయటకు రాకుండా ఉంటేనే బెటర్.. తెలంగాణ, ఏపీలో హీట్‌వేవ్ వార్నింగ్‌
Heatwave Alert
Shaik Madar Saheb
|

Updated on: Apr 28, 2024 | 8:07 AM

Share

డేంజర్‌.. డేంజర్‌..! మీరు ఇళ్ల నుంచి బయటికి వెళ్తున్నారా? బీ కేర్‌ఫుల్!. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి కాలు బయటపెట్టకండి. ఎందుకంటే, తెలుగురాష్ట్రాలకు రెడ్ వార్నింగ్‌ ఇచ్చింది వాతావరణశాఖ. మరో 3 రోజులపాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

8 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. శుక్రవారం దాదాపు 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. గత పదేళ్లలో ఏప్రిల్‌ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈస్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి. 45 డిగ్రీలు దాటిన కరీంనగర్‌, ములుగు, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్‌, వనపర్తి జిల్లాలకు రెడ్‌ వార్నింగ్‌ జారీ చేసింది వాతావరణశాఖ.

జమ్మికుంట-45.6, మంథని-45.2, నిడదమానురు-45.2, కోల్వాయి-45.1, మాడుగలపల్లి-45.1, మర్యాల-45.1, వీణవంక-45.1, వెల్గటూరు-45.1, భద్రాచలం-44, హైదరాబాద్‌-42 గా నమోదైంది..

తెలంగాణలో మరో మూడు రోజులపాటు ఎండలు మండిపోనున్నాయి. వృద్దులు, పిల్లలు, వీధి వ్యాపారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వీలయినంతవరకూ ఓర్‌ఎస్‌, చలువ చేసే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

ఏపీలోనూ భానుడి భగభగలు..

ఏపీలోనూ భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

శ్రీకాకుళంలో 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఇక నిన్న ఏపీలోని నంద్యాలజిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతిజిల్లా రేణిగుంటలో 45.7, కడపజిల్లా ఖాజీపేట, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 45.7, విజయనగరంజిల్లా గజపతినగరం, కర్నూలుజిల్లా కోడుమూరులో 44.8, అనంతపురంజిల్లా తాడిపత్రిలో 44.4, పల్నాడుజిల్లా మాచెర్లలో 44.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..