Telangana: బంజారాహిల్స్‌లో వెలుగులోకి అమానుష ఘటన.. మురుగు కాల్వలో కుళ్లిపోయిన తల్లి ప్రేమ

అన్నింటి కంటే నిస్వార్ధమైన ప్రేమ తల్లి ప్రేమ అంటారు. తన ప్రాణం పోయినా తన పిల్లల ప్రాణాలు కాపాడాలి అనుకుంటుంది. మనుషులకే మాత్రమే కాదు సమస్త జీవులకి తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది. జ్ఞానం లేని మూగజీవాలే తల్లి ప్రేమను చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ జ్ఞానం నుండి మాట్లాడగలిగిన మనుషుల్లో మాత్రం తల్లి ప్రేమ మంట కలిసిన సందర్భంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి.

Telangana: బంజారాహిల్స్‌లో వెలుగులోకి అమానుష ఘటన.. మురుగు కాల్వలో కుళ్లిపోయిన తల్లి ప్రేమ
Baby
Follow us
Sravan Kumar B

| Edited By: Balaraju Goud

Updated on: Apr 28, 2024 | 7:37 AM

అన్నింటి కంటే నిస్వార్ధమైన ప్రేమ తల్లి ప్రేమ అంటారు. తన ప్రాణం పోయినా తన పిల్లల ప్రాణాలు కాపాడాలి అనుకుంటుంది. మనుషులకే మాత్రమే కాదు సమస్త జీవులకి తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది. జ్ఞానం లేని మూగజీవాలే తల్లి ప్రేమను చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ జ్ఞానం నుండి మాట్లాడగలిగిన మనుషుల్లో మాత్రం తల్లి ప్రేమ మంట కలిసిన సందర్భంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి సంఘటన హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది.

బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కలకలం రేపింది. రోజు మాదిరిగానే వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని నంది నగర్‌లో సానిటేషన్ సిబ్బంది మురుగునీరు పనులు నిర్వహిస్తున్న సమయంలో శిశువు మృతదేహం బయటపడింది. వాటర్ వర్క్స్ సిబ్బంది అధికారులు మురుగునీటి సమస్య పరిష్కారానికి కంప్లైంట్ వచ్చింది. స్పాట్‌కు చేరుకున్న వాటర్ బాక్సు సిబ్బందికి మురుగు కాలువలో శిశువు మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది

మొదట కుళ్లిపోయిన స్థితిలో ఒక కళేబరం కనిపించడంతో ఏదైనా జంతువుదని భావించారు. కానీ ఆ కళేబరాన్ని మురుగు కాలువలోంచి బయటికి తీసి గమనించగా అప్పుడే పుట్టిన శిశువుగా గుర్తించారు. ఒక్కసారిగా సిబ్బంది ఉలిక్కిపడగా విషయం ఆ నోట తెలియడంతో స్థానికుల అక్కడికి చేరుకున్నారు. కుళ్ళిన స్థితిలో ఉన్న శిశువు మృతదేహాన్ని చూసి అక్కడున్న వారి హృదయం చెలించింది. శిశువు మృతదేహాన్ని గమనించిన కార్మికులు అధికారులకు విషయాన్ని తెలియజేయగా వారు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు.

క్లూస్ టీమ్ సాయంతో కలిసి ఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. పూర్తిగా కుళ్ళిపోయిన దశలో శిశువు మృతదేహం బయటపడింది. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా శిశువు మృతదేహం ఎవరైనా ఇక్కడ పడేశారా లేదంటే ఎక్కడైనా పడితే కాలువలో కొట్టుకుని వచ్చిందా అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..