కర్నూల్ ఓటర్ లిస్ట్‌లో వెంకీ ఫొటో.. ఏ పేరుతో ఉందంటే..!
ఓటర్ లిస్ట్‌లో తప్పులు సాధారణంగా దొర్లుతూనే ఉంటాయి. పుట్టిన తేది దగ్గరో.. ఇంటిపేరో.. అడ్రస్ దగ్గరో ఎక్కడో ఒక చోట చిన్న చిన్న దోషాలు పడుతూనే ఉంటాయి. చదువుకున్న వారైతే ఆ దోషాలను సంబంధిత కార్యాలయాలకు వెళ్లి సరిదిద్దుకుంటుంటారు. కానీ చదువురాని వారు అంత త్వరగా ఆ తప్పులను సరిదిద్దుకోలేరు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ నటుడు వెంకటేష్ ఫొటో ఇప్పుడు కర్నూల్ ఓటర్ లిస్ట్‌లో బయటపడింది. కర్నూల్‌లోని 31వ వార్డులో మహిళా ఓటర్ కొమరోలు రాణి […]
ఓటర్ లిస్ట్‌లో తప్పులు సాధారణంగా దొర్లుతూనే ఉంటాయి. పుట్టిన తేది దగ్గరో.. ఇంటిపేరో.. అడ్రస్ దగ్గరో ఎక్కడో ఒక చోట చిన్న చిన్న దోషాలు పడుతూనే ఉంటాయి. చదువుకున్న వారైతే ఆ దోషాలను సంబంధిత కార్యాలయాలకు వెళ్లి సరిదిద్దుకుంటుంటారు. కానీ చదువురాని వారు అంత త్వరగా ఆ తప్పులను సరిదిద్దుకోలేరు. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ నటుడు వెంకటేష్ ఫొటో ఇప్పుడు కర్నూల్ ఓటర్ లిస్ట్‌లో బయటపడింది. కర్నూల్‌లోని 31వ వార్డులో మహిళా ఓటర్ కొమరోలు రాణి పేరుకు వెంకటేష్ ఫొటోను పెట్టారు. ఇందులో ఆమెకు సంబంధించిన వివరాలన్నీ కరెక్ట్‌గానే ఉన్నప్పటికీ.. ఫొటో మాత్రం వెంకటేష్‌ది ఉంది. దీంతో ఆమెతో పాటు, అది చూసిన మిగిలిన వారు అవాక్కు అవుతుండగా.. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఓటర్ కార్డులో సెలబ్రిటీల ఫొటోలు ఇలా సంబంధం లేని ప్రదేశాల్లో కనిపించడం ఇది తొలిసారేం కాదు. గతంలోనూ పలువురి సెలబ్రిటీల ఫొటోలు మిస్‌ప్లేస్ అయ్యాయి.