తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగానే ఈ వర్షాలు!
తీవ్ర ఉష్ణగ్రతల కారణంగానే వర్షాలతో పాటు చలి కూడా ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. చలికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడం వలన ఉపరితల ఆవర్తనం, ఉపరిత ద్రోణులు ఏర్పడ్డట్టు ఆయన తెలిపారు. గతేడాది ఇదే సీజన్‌లో కూడా ఇలానే జరిగిందన్నారు. బంగాళా ఖాతం, అరేబియా సముద్రం నుండి తేమ గాలులు ఉత్తర భారతదేశం నుండి వచ్చే పొడిగాలులు కలయిన వలన ఉష్టోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగిందని వారు పేర్కొన్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు […]
తీవ్ర ఉష్ణగ్రతల కారణంగానే వర్షాలతో పాటు చలి కూడా ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. చలికాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడం వలన ఉపరితల ఆవర్తనం, ఉపరిత ద్రోణులు ఏర్పడ్డట్టు ఆయన తెలిపారు. గతేడాది ఇదే సీజన్‌లో కూడా ఇలానే జరిగిందన్నారు. బంగాళా ఖాతం, అరేబియా సముద్రం నుండి తేమ గాలులు ఉత్తర భారతదేశం నుండి వచ్చే పొడిగాలులు కలయిన వలన ఉష్టోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగిందని వారు పేర్కొన్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని, తెలంగాణలో ఈ రోజు, రేపు అక్కడక్కడ తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
కాగా.. తెలంగాణలో ఈ అకాల వర్షానికి అన్నదాతలు నష్టపోతున్నారు. ముఖ్యంగా మిర్చి, పత్తి, వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లోని పంట తడిసి ముద్దైంది. అమ్ముకునే సమయానికి.. వర్షం వల్ల పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.