యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై లడ్డూలు స్పీడ్ పోస్టులో..
Good News To Devotees: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ శుభవార్తను అందించింది. స్వామివారి లడ్డూ ప్రసాదం, అక్షింతలు, కుంకుమను భక్తులకు స్పీడ్ పోస్టులో సరఫరా చేయాలని నిర్ణయించింది. అందుకు గానూ తపాలాశాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. త్వరలోనే ఈ సేవలను పోస్టల్ శాఖ ప్రారంభించనుంది. ఇందుకోసం దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నారు. మరోవైపు యాదాద్రితో పాటుగా భద్రాచలం, బాసర, వేములవాడలతో సహా మరో 10 ఆలయాలకు చెందిన ప్రసాదాలు, కుంకుమను కూడా స్పీడ్ […]
Good News To Devotees: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దేవాదాయశాఖ శుభవార్తను అందించింది. స్వామివారి లడ్డూ ప్రసాదం, అక్షింతలు, కుంకుమను భక్తులకు స్పీడ్ పోస్టులో సరఫరా చేయాలని నిర్ణయించింది. అందుకు గానూ తపాలాశాఖతో ఒప్పందం కుదుర్చుకోనుంది. త్వరలోనే ఈ సేవలను పోస్టల్ శాఖ ప్రారంభించనుంది. ఇందుకోసం దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక యాప్‌ను రూపొందించనున్నారు.
మరోవైపు యాదాద్రితో పాటుగా భద్రాచలం, బాసర, వేములవాడలతో సహా మరో 10 ఆలయాలకు చెందిన ప్రసాదాలు, కుంకుమను కూడా స్పీడ్ పోస్టులో భక్తుల ఇంటికే చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వీటిని పొందాలంటే నెట్ బ్యాంకింగ్, ఇతర ఈ-వాలెట్స్ ద్వారా చెల్లింపులు స్వీకరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక వాటి రేట్లను బరువు ఆధారంగా పోస్టల్ శాఖ నిర్ణయించనుంది. కాగా, ఈ నెల చివరికల్లా దేవాదాయశాఖ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా భక్తులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.