‘పసిపిల్ల మైండ్‌ని ఎందుకు పాడు చేస్తున్నారు’?

తన కూతురు హిమ మనస్సును తన తలిదండ్రులు ఆనందరావు, సౌందర్య పాడు చేస్తుంటారని, ఆమెను వంటలక్క (దీప) వైపు మొగ్గేట్టు చేస్తుంటారని కార్తీక్ మండిపడుతుంటాడు. అందుకే ఒక్కసారిగా వారున్న గదిలోకి ఎంటరై.. వారిని ఓ ‘ఆట ఆడుకునేందుకు’  ప్రయత్నిస్తాడు. అయితే ‘సీనియర్ భార్యాభర్తలైన’ ఆ దంపతుల ముందు అతని ఆటలు సాగవు. ముఖ్యంగా ‘మమ్మీ’ సౌందర్య ముందు ఎప్పుడూ ఆ ‘ కుమారరత్నం’ ఓడిపోతుంటాడు. చివరకు వారి సెటైర్లకు తట్టుకోలేక ‘మీరేమిటి ? లవర్స్ లాగా మాట్లాడుతుంటారు […]

'పసిపిల్ల మైండ్‌ని ఎందుకు పాడు చేస్తున్నారు'?
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 10, 2020 | 1:44 PM

తన కూతురు హిమ మనస్సును తన తలిదండ్రులు ఆనందరావు, సౌందర్య పాడు చేస్తుంటారని, ఆమెను వంటలక్క (దీప) వైపు మొగ్గేట్టు చేస్తుంటారని కార్తీక్ మండిపడుతుంటాడు. అందుకే ఒక్కసారిగా వారున్న గదిలోకి ఎంటరై.. వారిని ఓ ‘ఆట ఆడుకునేందుకు’  ప్రయత్నిస్తాడు. అయితే ‘సీనియర్ భార్యాభర్తలైన’ ఆ దంపతుల ముందు అతని ఆటలు సాగవు. ముఖ్యంగా ‘మమ్మీ’ సౌందర్య ముందు ఎప్పుడూ ఆ ‘ కుమారరత్నం’ ఓడిపోతుంటాడు. చివరకు వారి సెటైర్లకు తట్టుకోలేక ‘మీరేమిటి ? లవర్స్ లాగా మాట్లాడుతుంటారు ‘ అంటూ  వెళ్ళిపోతాడు. సీన్ మారితే.. శౌర్య శ్రావ్య ఇంటికి వస్తుంది. అక్కడ భాగ్యం ఆ అమ్మాయిని చూసి ఈసడించుకుంటుంది. బాబును చూసి వెళ్లిపోతానని శౌర్య అంటుంది. శ్రావ్య తల్లిని మందలిస్తుంది.  ఆ ఇంట్లో ఆ చిన్నారికి తగిన ఆప్యాయత దొరకదు. తనపట్ల ఆ తల్లీ కూతుళ్లు.. ముఖ్యంగా భాగ్యం చూపిన నిరాదరణకు చిన్నబుచ్చుకుని శౌర్య వెళ్ళిపోతుంది.

సీన్ మారితే.. మౌనిత, ప్రియమణి మధ్య అదే సీన్.. హిమ వంటలక్క వైపే మొగ్గు చూపడాన్ని సహించలేక  మౌనిత మధనపడుతుంటే.. ప్రియమణి ఆమెను ‘ఓదార్చే’ ప్రయత్నం షరా మామూలే ! చివరి ఘట్టం వచ్చేసరికి..దీప .. తన కూతురు ఇంకా ఇంటికి రాలేదని, బహుశా శ్రావ్య ఇంటికి వెళ్లి ఉంటుందని ఆలోచిస్తుంటుంది.