‘డొల్ల పార్టీలకు’ వరంగా మారిన ‘ఎలెక్టోరల్ బాండ్లు’
జాతీయ పార్టీలను పక్కన పెడితే ఊరూ, పేరూ లేని ‘డొల్ల పార్టీలకు’ ఎలెక్టోరల్ బాండ్లు వరంగా మారాయి. గుర్తింపు పొందని సుమారు 70 పార్టీలు 2017 నుంచి ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు అందుకున్నాయని ఎన్నికల కమిషన్.. సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో తెలిపింది. వీటిలో కొన్నింటికి ‘గుర్తించలేని చిరునామాలు’ ఉన్నాయని, కొన్ని పేర్లయితే ‘అమాం బాపతు’ పేర్లలా ఉన్నాయని పేర్కొంది. వీటిలో సబ్ సే బడీ పార్టీ, రాష్ట్రీయ పీస్ పార్టీ, హిందుస్థాన్ యాక్షన్ పార్టీ, […]
జాతీయ పార్టీలను పక్కన పెడితే ఊరూ, పేరూ లేని ‘డొల్ల పార్టీలకు’ ఎలెక్టోరల్ బాండ్లు వరంగా మారాయి. గుర్తింపు పొందని సుమారు 70 పార్టీలు 2017 నుంచి ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు అందుకున్నాయని ఎన్నికల కమిషన్.. సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో తెలిపింది. వీటిలో కొన్నింటికి ‘గుర్తించలేని చిరునామాలు’ ఉన్నాయని, కొన్ని పేర్లయితే ‘అమాం బాపతు’ పేర్లలా ఉన్నాయని పేర్కొంది. వీటిలో సబ్ సే బడీ పార్టీ, రాష్ట్రీయ పీస్ పార్టీ, హిందుస్థాన్ యాక్షన్ పార్టీ, నాగరిక్ ఏక్ తా పార్టీ, భారత్ కీ లోక్ జిమ్మేదార్ పార్టీ, వికాస్ ఇండియా పార్టీ, రైట్ టు రీకాల్ పార్టీ వంటివి ఉన్నాయని వెల్లడించింది.
రిజిస్టర్ అయినప్పటికీ, గుర్తింపు లేని రాజకీయ పార్టీ… ఫిక్స్ చేసిన చిహ్నంపై సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయజాలదు. ఈసీ పేర్కొన్న చిహ్నాల్లో అది ఏదో ఒకదానిని సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది.ఈ విధమైన పార్టీల ఎన్నికల హిస్టరీని ట్రాక్ చేయడం ఈసీకి కష్టసాధ్యమవుతుంది. ఎలెక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటును, రాజ్యాంగ బధ్ధతను సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ ఈసీ వద్ద ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా.. దీనిపై ఈసీ.. ఓ అఫిడవిట్ ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో అందే విరాళాలపై క్లారిటీ రావడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని ప్రభుత్వం అంటుండగా.. ఈసీతో సహా అనేక వర్గాలు అసలు ఈ పథకంలోనే తిరకాసు ఉందని ఆక్షేపిస్తున్నాయి. కాగా ఈ డొల్ల పార్టీల్లో కొన్ని మనీ లాండరింగ్ లావాదేవీలకు కూడా పాల్పడుతున్నాయని వెల్లడైంది.
ఉదాహరణకు 2017 లో యూపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోను, 2014 లో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లోనూ నాగరిక్ ఏక్ తా పార్టీ, భారత్ కీ లోక్ జిమ్మేదార్ పార్టీలకు 1 శాతం కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయట. ఇది ఎలా జరిగిందన్నదానిపై.. సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే తాము సమాధానం చెబుతామని ఈసీ పేర్కొంది. తన అఫిడవిట్ లో ఎన్నికల కమిషన్.. బీజేపీ, కాంగ్రెస్ సహా మరో 20 పార్టీలు ఎలెక్టోరల్ బాండ్ల ద్వారా డొనేషన్లు స్వీకరించాయని తెలిపింది. అయితే ఇవి ఎన్ని నిధులు అందుకున్నాయన్న వివరాలను వెల్లడించలేదు.