AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: మిస్టరీగా మారిన రూ.6,700 కోట్లు.. ఇప్పటికీ తిరిగి రాని నోట్లు.. ఎటు పోయాయి?

RBIఐ 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుని 19 నెలలకు పైగా, 6,700 కోట్ల రూపాయల నోట్లు ఇంకా వాపసు కాలేదని RBI తెలిపింది. నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించి ఇన్ని నెలలు అయినప్పటికీ ఈ నోట్లు ఎక్కడికి పోయాయనే ఆర్బీఐ షాకవుతోంది. ఇప్పుడు ఆర్బీఐ కీలక విషయాలు వెల్లడించింది..

RBI: మిస్టరీగా మారిన రూ.6,700 కోట్లు.. ఇప్పటికీ తిరిగి రాని నోట్లు.. ఎటు పోయాయి?
Subhash Goud
|

Updated on: Jan 10, 2025 | 6:59 PM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి ఏడాదిన్నర దాటింది. అయితే 1.88 శాతం కరెన్సీ నోట్లు ఇంకా వెనక్కి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 1, 2025న అధికారికంగా ప్రకటించింది. RBI డేటా ప్రకారం, తిరిగి రాని కరెన్సీ నోట్లు రూ.6,691 కోట్లు ఉందని తెలిపింది.

2023లో రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకున్నారు. తదనంతరం, భారతదేశంలోని అన్ని బ్యాంకు శాఖలలో రూ.2000 నోట్లను డిపాజిట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకులతో పాటు ప్రభుత్వ ఆమోదం పొందిన స్థలాల్లో డిపాజిట్ చేశారు. ఈ పథకం చెలామణిలో ఉన్నప్పుడు మొత్తం రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు.

రూ.6,700 కోట్లు ఎక్కడ?

ఇవి కూడా చదవండి

ఇది డిసెంబర్ 31, 2024 నాటికి రూ.6,691 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ అధికారిక గణాంకాలు తెలిపాయి. అంటే చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 98.12 శాతం తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటించింది. దానికి సంబంధించి రూ.2 వేల నోట్లలో 1.88 శాతం తిరిగి రాలేదు. ఆర్‌బీఐ అధికారిక గణాంకాల ప్రకారం దీని విలువ రూ.6,691 కోట్లు.

ప్రింటింగ్ నిలిపివేత

గతంలో 2018-19లో రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అంటే రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత ప్రజలకు డబ్బులు అందడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ క్రమంలోనే రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టారు. ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేసింది.

ఇది కూడా చదవండి: School Holidays: 2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. బంగారం ధర భారీగా తగ్గనుందా?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సూర్యకాంతం చనిపోతే ఎవరూ ఎందుకు వెళ్ళలేదంటే..?
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
సండే స్పెషల్.. హైదరాబాదీ చికెన్ గ్రేవీ. ఇలా వండితే అదిరిపోద్దీ!
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ఫారెస్ట్-టు-టేబుల్ భోజనం! భూమి పెడ్నేకర్ నేచర్ టూర్
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
ప్రమాదంలో కోహ్లీ రికార్డ్.. తొక్కి పడేసేందుకు సిద్ధమైన 5గురు?
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
సినిమా డిజాస్టర్ అని చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు.. కట్ చేస్తే
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
త్వరలో నంది అవార్డులు.. టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
రోబో సినిమాలో రజనీకాంత్‌లా క్షణ్లాలో స్టోరీ చదివేయొచ్చు!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
గుండెను పదిలంగా ఉంచుకోవడానికి నిపుణుల చిట్కాలివే!
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. సీజన్‌కు ముందే ఇబ్బందుల్లో 9 జట్లు..?