PM Svanidhi: ఆధార్ ఉంటే చాలు.. రూ.50 వేల వరకు రుణం తీసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?
PM Svanidhi: కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది. ఆధార్ కార్డు ద్వారా రుణాలు తీసుకోవచ్చనే విషయం మీకు తెలుసా..? చిన్న వ్యాపారులకు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు పథకాలను రూపొందిస్తోంది. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి..
ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న, సూక్ష్మ వ్యాపారుల కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది. కార్మికుల ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో ప్రధాన మంత్రి స్వనిధి యోజన ఒకటి. చిన్న, సూక్ష్మ పరిశ్రమల కార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ప్రధాన మంత్రి స్వనిధి యోజన పథకం
ఈ పథకాన్ని 2020లో తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి సమయంలో చిరు వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ విధంగా వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధాన మంత్రి స్వానిధి యోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో ఆధార్ కార్డు ద్వారా రూ.50,000 వరకు రుణాలు పొందవచ్చు. ముందుగా వ్యాపారులకు రూ.10వేలు రుణం ఇస్తారు. వారు సరిగ్గా రుణం చెల్లిస్తే వచ్చేసారి రూ.20,000 పొందవచ్చు. ఈ విధంగా వ్యాపారులు రూ.50,000 వరకు రుణాలు పొందవచ్చు. రుణాన్ని వాయిదాల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.
అంటే, రుణాన్ని 12 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. పథకం కింద రుణం పొందడానికి వ్యాపారులు ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని తర్వాత, మీ లోన్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
ఇది కూడా చదవండి: Indian Railways: భారతదేశపు అత్యంత చౌకైన ఏసీ రైలు.. కి.మీ కేవలం 68 పైసలే..!
ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు ప్రధాన్ మంత్రి స్వానిధి యోజన వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. మీ ఆధార్ నంబర్‌ను మీ మొబైల్ నంబర్‌తో లింక్ చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు e-KYC ధృవీకరణ ఉంటుంది. మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. అలాగే, రుణగ్రహీతలు పట్టణ స్థానిక సంస్థల నుండి లేఖను పొందాలి. ఈ పథకం కింద కేవలం నాలుగు కేటగిరీల వ్యాపారులు మాత్రమే రుణానికి అర్హులు. ప్రధాన్ మంత్రి స్వానిధి యోజన పథకం కింద రుణం పొందాలనుకునే వారు ఆన్‌లైన్‌లో లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు (RRB), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFB), కో-ఆపరేటివ్ బ్యాంకులకు వడ్డీ రేట్లు ప్రస్తుత ధరల ప్రకారం ఉంటాయి.
ఇది కూడా చదవండి: School Holidays: 2025లో ఏపీ విద్యార్థులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా? పూర్తి జాబితా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి