కరోనా.. సార్స్‌ను మించి.. చైనాలో మోగుతున్న మృత్యుఘంటికలు

కరోనా రోజురోజుకీ తన ప్రతాపాన్ని చూపుతోంది. అడ్డూ.. అదుపూ లేకుండా విజృంభిస్తోంది. చైనాలో ఈ రాకాసి వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 908కి  పెరిగింది. కొత్తగా 40 వేల కేసులను గుర్తించినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఒక్క ఆదివారం నాడే 97 మంది మృత్యువాత పడగా.. 3,062  వ్యాధి లక్షణాలు సోకాయి. కేవలం హుబె ప్రావిన్స్‌లోనే 91 మంది మరణించారు. అయితే కోలుకున్న రోగుల్లో 3,281 మందిని ఆసుపత్రుల నుంచి […]

కరోనా.. సార్స్‌ను మించి.. చైనాలో మోగుతున్న మృత్యుఘంటికలు
Follow us
Umakanth Rao

| Edited By: Ravi Kiran

Updated on: Feb 10, 2020 | 12:07 PM

కరోనా రోజురోజుకీ తన ప్రతాపాన్ని చూపుతోంది. అడ్డూ.. అదుపూ లేకుండా విజృంభిస్తోంది. చైనాలో ఈ రాకాసి వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 908కి  పెరిగింది. కొత్తగా 40 వేల కేసులను గుర్తించినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఒక్క ఆదివారం నాడే 97 మంది మృత్యువాత పడగా.. 3,062  వ్యాధి లక్షణాలు సోకాయి. కేవలం హుబె ప్రావిన్స్‌లోనే 91 మంది మరణించారు. అయితే కోలుకున్న రోగుల్లో 3,281 మందిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారన్న వారి పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతోందని స్పష్టం చేస్తోంది. కరోనా భయంతో బీజింగ్, షాంఘై నగరాలు  సైతం క్రమేపీ బోసిపోతున్నాయి. వూహాన్ సిటీ పూర్తి నిర్మానుష్యంగా మారింది. ఇంత ‘దారుణం’ జరుగుతున్నా కరోనా వైరస్ కేసులు మెల్లగా ఒక కొలిక్కి వస్తున్నాయని, పెద్దగా పెరగడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఈ సంస్థ హెడ్ మైఖేల్ ర్యాన్.. హుబె నుంచి అందుతున్న వార్తల ప్రకారం.. కేసుల సంఖ్య స్థిరంగా ఉందన్నారు. అయితే ఇప్పుడే ఏమీ చెప్పజాలమన్నారు.