షాకింగ్.. గెలిచేది మేమేనంటూ కమలనాథుల సంచలన ట్వీట్స్.. ధీమా అదేనా..?
ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. ఢిల్లీ పీఠం కేజ్రీకి దక్కుతుందంటూ తేల్చేస్తే.. మరోవైపు కమలనాథులు విజయం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గెలుపు మాదేనని.. ప్రతీపార్టీ చెప్తుంది కానీ.. ఈ సారి ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు మాత్రం.. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమయ్యాయంటున్నారు. అంతేకాదు.. ఢిల్లీ పీఠం ఎక్కేది కమలనాథులేనంటూ స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన అనంతరం.. ఎగ్జిట్‌పోల్స్ రిజల్ట్స్ వెలువడిన కొద్ది సేపటికే.. బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ […]
ఓ వైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ.. ఢిల్లీ పీఠం కేజ్రీకి దక్కుతుందంటూ తేల్చేస్తే.. మరోవైపు కమలనాథులు విజయం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా గెలుపు మాదేనని.. ప్రతీపార్టీ చెప్తుంది కానీ.. ఈ సారి ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు మాత్రం.. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమయ్యాయంటున్నారు. అంతేకాదు.. ఢిల్లీ పీఠం ఎక్కేది కమలనాథులేనంటూ స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు జరిగిన అనంతరం.. ఎగ్జిట్‌పోల్స్ రిజల్ట్స్ వెలువడిన కొద్ది సేపటికే.. బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున.. ఎగ్జిట్‌పోల్స్ విఫలమవుతాయని, బీజేపీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తుందని ట్వీట్ చేశారు. అంతేకాదు.. మీకు అనుమానం ఉంటే.. ఈ ట్వీట్ సేవ్ చేసి పెట్టుకోండి. రిజల్ట్ రోజు మాట్లాడండి అంటూ.. ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇక బీజేపీ మిత్రపక్షమైన అకాలీ దళ్‌కి చెందిన నేత మన్జిందర్ సింగ్ సిర్సా కూడా ఇదే విధంగ ట్వీట్ చేశారు. ఢిల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేయబోతోందని.. ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైతాయని.. కావాలంటే.. నేను చేసిన ఈ ట్వీట్‌ను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
స్పష్టమైన ఆధిక్యంతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఆ తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించవద్దంటూ ఆప్‌ను ఉద్దేశించి తివారీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇలా ఇద్దరు నేతలు చాలా స్పష్టంగా బీజేపీదే గెలుపు అని చెప్పడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ఓటర్ల నాడిని పసిగట్టడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయా..?లేక.. కావాలనే వీరు ఇలా ప్రచారం చేస్తున్నారా అన్నది.. రిజల్ట్స్ రోజు తేలిపోనుంది.
ये सभी एग्ज़िट पोल होंगे fail.. मेरी ये ट्वीट सम्भाल के रखियेगा.. भाजपा दिल्ली में ४८ सीट ले कर सरकार बनायेगी .. कृपया EVM को दोष देने का अभी से बहाना ना ढूँढे..?
— Manoj Tiwari (@ManojTiwariMP) February 8, 2020
स्क्रीनशॉट लेकर रख लो वोटरों से मिलने के बाद दावे से कहता हूँ-
दिल्ली विधानसभा चुनाव में
भाजपा जीतेगी 43-46 सीटें आप 20-22 सीटें कांग्रेस 2-3 सीटें कांग्रेस की 60 सीटों पर ज़मानत होगी ज़ब्त#DelhiElections2020 #DelhiElection @BJP4Delhi @AamAadmiParty @INCIndia @ANI @republic
— Manjinder S Sirsa (@mssirsa) February 8, 2020