AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..

క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు... చేతిలో డబ్బులు లేకపోయినా షాపింగ్‌లు, ఈఎంఐలతో లైఫ్‌ను ఎంజాయ్ చేసేయొచ్చు.. కానీ బిల్లు కట్టే సమయం వచ్చేసరికి మ్యాటర్ రివర్స్ అవుతుంది. బ్యాంక్ రికవరీ ఏజెంట్ల ఫోన్లు, వేధింపులు మొదలవుతాయి. అయితే ఇక్కడే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది.. ఒకవేళ బిల్లు ఎగ్గొడితే పోలీసులు అరెస్ట్ చేస్తారా? అని.. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చట్టం ఏం చెప్తుందో తెలుసుకోండి..
Can Police Arrest For Credit Card Default
Krishna S
|

Updated on: Jul 23, 2026 | 7:30 PM

Share

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి జేబులోనూ క్రెడిట్ కార్డ్ కామన్‌గా మారిపోయింది. రెస్టారెంట్ బిల్లుల నుండి షాపింగ్, మొబైల్ ఈఎంఐల వరకు ప్రతీ నెలవారీ ఖర్చునూ క్రెడిట్ కార్డుల ద్వారానే కానిచ్చేస్తున్నారు. అయితే కార్డు వాడకం పెరిగినట్లే.. సరైన సమయానికి బిల్లులు చెల్లించక ఇబ్బందుల్లో పడేవారి సంఖ్య కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. బిల్లు బకాయిలు పెరిగిపోతే రికవరీ ఏజెంట్ల వేధింపులు మొదలవుతాయి. ఈ క్రమంలోనే ‘‘బిల్లు కట్టకపోతే పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారా? జైలుకు పంపుతారా?’’ అనే భయం చాలామందిని వెంటాడుతుంటుంది. అసలు చట్టపరంగా ఏం జరుగుతుంది? బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

పోలీసులు అరెస్టు చేయగలరా? చట్టం ఏం చెబుతోంది?

ముందుగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే… క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించనంత మాత్రాన పోలీసులు మిమ్మల్ని నేరుగా వచ్చి అరెస్టు చేయలేరు.ఎందుకంటే.. క్రెడిట్ కార్డ్ బిల్లు ఎగవేత అనేది సివిల్ వివాదం కిందకు వస్తుంది కానీ.. నేరపూరితమైన చర్య కిందకు రాదు. ఇది ఒక ఆర్థిక రుణ ఎగవేత కాబట్టి ఈ వ్యవహారాన్ని బ్యాంకు, కోర్టు ద్వారా మాత్రమే సివిల్ పద్ధతిలోనే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పోలీసులు నేరుగా వచ్చి మీపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపే అధికారం లేదు.

బిల్లు కట్టకపోతే ఎదురయ్యే ప్రధాన సమస్యలు

పోలీసు అరెస్ట్ భయం లేకపోయినప్పటికీ, బిల్లులు కట్టకపోతే తీవ్రమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.జ

క్రెడిట్ స్కోర్: మీరు క్రెడిట్ కార్డ్ బిల్లును నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే, అది మీ సిబిల్ స్కోర్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది.

భవిష్యత్తులో రుణాలు : స్కోర్ దెబ్బతినడం వల్ల భవిష్యత్తులో పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా కనీసం కొత్త క్రెడిట్ కార్డ్ పొందడం కూడా దాదాపు అసాధ్యంగా మారుతుంది.

కార్డ్ బ్లాక్ – బ్లాక్‌లిస్ట్: బిల్లులు నిలిపివేస్తే బ్యాంకులు మీ క్రెడిట్ కార్డులను తక్షణమే బ్లాక్ చేస్తాయి. అంతేకాకుండా కస్టమర్‌ను డిఫాల్టర్‌గా గుర్తించి బ్లాక్‌లిస్ట్‌లో పెడతాయి.

బ్యాంకులు తీసుకునే కఠిన చర్యలు ఇవే..

బకాయిలు చాలా కాలం పాటు పెండింగ్‌లో ఉంటే ఆ డబ్బును వసూలు చేయడానికి బ్యాంకులు చట్టపరమైన మార్గాలను ఆశ్రయిస్తాయి..

సివిల్ కేసు దాఖలు: బకాయి వసూలు కోసం బ్యాంకు మీపై కోర్టులో సివిల్ రికవరీ సూట్ దాఖలు చేయవచ్చు.

ఖాతాలోని డబ్బు సర్దుబాటు: ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్న బ్యాంకులోనే మీకు సేవింగ్స్ లేదా ఇతర బ్యాంకింగ్ ఖాతాలు ఉంటే.. బ్యాంకుకు ఉన్న రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అధికారం ద్వారా మీ ఖాతాలోని డబ్బుతో క్రెడిట్ కార్డ్ బకాయిలను సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ఆస్తుల జప్తు చట్టపరమైన ప్రక్రియ: కోర్టు ఆదేశాల మేరకు, తీవ్రమైన ఎగవేత కేసుల్లో బకాయిలను రికవరీ చేయడానికి ఆస్తులను జప్తు చేసే దిశగా బ్యాంకులు చట్టపరమైన చర్యలు ముందుకు తీసుకెళ్లవచ్చు.

క్రెడిట్ కార్డ్ అనేది అవసరానికి ఉపయోగపడే మంచి ఆర్థిక సాధనమే అయినా పరిమితికి మించిన ఖర్చులు, బిల్లుల ఎగవేత మీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీస్తాయి. జైలుకు వెళ్లే ప్రమాదం లేనప్పటికీ, తీవ్రమైన వడ్డీల భారం, సిబిల్ స్కోర్ దెబ్బతినకుండా ఉండాలంటే సమయానికి బిల్లులు చెల్లించడమే అత్యంత సురక్షితమైన మార్గం.

Follow Us